Karthika masam: కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజులుగా చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కార్తీక శుక్రవారం చాలా మంచిది. ఇలాంటి కార్తీక శుక్రవారం నాడు చేయాల్సిన పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతోందనుకొనే వారు కార్తీక శుక్రవారం రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. ముఖ్యంగా పర్సులో ఓ వస్తువు ఉంచుకోవాలట. (Karthika masam)
తెలుగు వారికి కార్తీక మాసం చాలా ముఖ్యమైనది. సంప్రదాయబద్ధంగా అనేక నియమాలు ఈ మాసంలో పాటిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా అనేక పద్ధతులు పాటించే వారు ఉన్నారు. ప్రత్యేకించి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే కార్తీకమాసం సరైన సమయంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దాని కోసం అనేక ఉపాయాలు ఉన్నాయి.
పగలూ, రాత్రి శ్రమించినా కలిసి రావడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారి కోసం జ్యోతిష్య శాస్త్రంలో అనేక నివారణ ఉపాయాలు సూచిస్తున్నారు నిపుణులు. కార్తీక మాసం అంటే శివునికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రం. ఈ నెలలో చేసే ప్రతి పనీ చాలా అద్భుతంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని చాలా మంది కోరుకుంటారు.
ఈ వస్తువును మీ పర్సులు పెట్టుకోవాలి..
బంగారం లేదా వెండి నాణేన్ని మీ పర్సులో ఉంచుకుంటే ఇక మీకు తిరుగుండదట. అపారమైన సంపద మీ సొంతమవుతుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ మాసంలో వచ్చే శుక్రవారం రోజు బంగారం, లేదా వెండి నాణేన్ని పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడానికి ముందు లక్ష్మీదేవిని పూజించండి. ఆమె పాదాలకు వీటిని సమర్పించి తర్వాత మాత అనుగ్రహం పొందేలా కోరుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరిపోతాయి. పేదలకు సాయం చేస్తూ, వారికి ఆహారం పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Money Tips: ఇంట్లో ధనం పుష్కలంగా ఉండాలంటే.. ఉప్పుతో ఇలా చేయండి!