Arthritis Patients: మహిళలు, మగవారిలో కూడా ఓ వయసు దాటాక కీళ్ల నొప్పుల సమస్య ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ఎక్కడకు వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు. నలుగురితో కలిసి హాయిగా అలా కనీసం షికారుకు కూడా వెళ్లలేని పరిస్థితి ఎదుర్కొంటుంటారు. కీళ్ల నొప్పులు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్యగా చెప్పుకోవచ్చు. ఎముకలు, కణజాలానికి సంబంధించిన సమస్య కావడంతో వీటి నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. (Arthritis Patients)
భారతదేశ జనాభాలో సుమారు 22 నుంచి 39 శాతం మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే కీళ్ల నొప్పుల సమస్య అధికంగా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఈ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. తద్వారా లక్షణాల తీవ్రత తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ పేషెంట్లు ఉప్పు తీసుకోకుంటే మంచిది. అలాగే పెరుగుకు కూడా దూరంగా ఉండాలి.
ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారే ఎక్కువట..
ప్రపంచంలో ఇతర జబ్బుల కంటే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారే ఎక్కువని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కీళ్ల నొప్పుల సమస్యలో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 200 కంటే ఎక్కువే ఆర్థరైటిస్ సమస్యలున్నాయని అధ్యయనాల్లో తేలింది. వీటిలో ముఖ్యంగా ఆస్టియో, రుమటాయిడ్, యాంకైలోజింగ్ స్పాండైల్, గౌట్, జువెనైల్ ఇడియోఫథిక్ ఆర్థరైటిస్, లూపస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ తదితర సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్య ఉన్న వారు స్వీట్ల జోలికి అస్సలు పోకూడదు..
ఆర్థరైటిస్ సమస్యలున్న వారు స్వీట్ల జోలికి పోరాదు. మిఠాయిలు తింటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బంగాళాదుంపలు కూడా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు. ఆలూ తినడం వల్ల కీళ్లలో నొప్పి, వాపు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పాలు కూడా తీసుకోరాదంటున్నారు. రెడ్ మీట్ కూడా తీసుకోరాదు. ఇది తింటే కీళ్ల వాపు మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. తృణధాన్యాలు, పోషకాహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
వృద్ధులలో కీళ్ల నొప్పులు సాధారణమే. అయితే, ఆశ్చర్యకరంగా, యువకులలో ఎముకలు, కీళ్ల నొప్పుల ప్రాబల్యం కూడా పెరుగుతోందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలిక నొప్పితో జీవిస్తున్న భారతీయ జనాభాలో దాదాపు 20-25% మంది కీళ్లకు సంబంధించిన మస్క్యులోస్కెలెటల్ రుగ్మతలతో బాధపడుతున్నారట. ప్రమాదకరమైన సంఘటనల రేటు ఇప్పుడు కలవరపెడుతోంది. కీళ్ల నొప్పులు ఎందుకొస్తాయో అందరూ తప్పక తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీ కీళ్లు మీ శరీరంలో రెండు ఎముకలు కలిసే భాగాలు. అస్థిపంజర వ్యవస్థలోని కీళ్ల అనాటమీ కారణంగా మీరు శరీరాన్ని కదిలించగలుగుతారు. కీళ్లలో నాలుగు ప్రధాన రకాలు ఉంటాయి. అందులో మోకాలి కీలు, హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్.
Read Also : Bone Density: ఈ ఆహారాలు తింటే మీ ఎముకలు బలంగా తయారవుతాయి..