HomeCinemaTollywood Dubbed Movies: టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన 5 డబ్బింగ్‌ మూవీస్‌ ఇవే!

Tollywood Dubbed Movies: టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన 5 డబ్బింగ్‌ మూవీస్‌ ఇవే!

Tollywood Dubbed Movies: తెలుగులో స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలు ప్రస్తుతం ఇతర భాషల్లోనూ రిలీజ్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని విజయాలు సాధిస్తుండగా మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి. ఇప్పుడంటే పాన్‌ ఇండియా రేంజ్‌ అనే ట్యాగ్‌ లైన్‌వచ్చి చేరింది కానీ.. గతంలో డబ్బింగ్‌ మూవీస్‌కి కొదవ లేదు. ముఖ్యంగా తమిళం, కన్నడ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్బింగ్‌ అయి వచ్చాయి.

వీటిలో సంచలన విజయాలు అందుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇలా డబ్బింగ్‌ అయి వచ్చి కోట్లాది రూపాయలు బిజినెస్‌ చేసిన సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే అవుతుంది. తాజాగా కన్నడ స్టార్‌ హీరో యష్‌ నటించిన కేజీఎఫ్‌ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ చాలా భాషల్లో రిలీజ్‌ అయ్యింది. (Tollywood Dubbed Movies)

తెలుగు రాష్ట్రాల్లో రోబో చిత్రం సుమారు రూ.71 కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీలోనే సుమారు 39 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించిందట. రజనీకాంత్ నటించిన మరో మూవీ కాలా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల మేర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించిందట. ఇక కబాలి సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించింది. ఇలా తెలుగులో టాప్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సాధించిన డబ్బింగ్‌ సినిమాల్లో రజనీకాంత్‌ సినిమాలే ఉండటం గమనార్హం.

తెలుగులో అత్యధిక బిజినెస్‌ జరుపుకున్న సినిమాగా కేజీఎఫ్‌2 రికార్డులకెక్కింది. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా కంటే ముందే కొన్ని డబ్బింగ్‌ సినిమాలు ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో అధిక వసూళ్లు రాబట్టాయి. సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన రోబో 2.0 చిత్రం డబ్బింగ్‌ సినిమాల్లో అత్యధికంగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన సినిమాగా నిలిచింది.

రజనీకాంత్‌ కబాలి చిత్రంలో తైవాన్ నటుడు వింస్టన్ చావో ప్రతినాయకుడుగా నటించాడు. ప్రతినాయకుడికి కుడిభుజంగా మలేషియన్ నటుడు రోసియం నటించాడు. మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన విలాసవంతమైన కార్లను మలేషియాలో ఉన్న అభిమానులు అందించారు. ఆడియో విడుదల రోజున కార్ల యజమానులు సినిమా పోస్టర్లు, కార్లతో రోడ్ షో ప్రదర్శించారు. చిత్రం ప్రీ రిలీజ్ సమయంలోనే చిత్రం 200 కోట్ల వసూల్ సాధించి నూతన రికార్డ్ సృష్టించింది. చిత్రం అంతర్జాతీయంగా 10,000 థియేటర్లలో విడుదలైంది. చైనాలో మాత్రం 5,000 థియేటర్లలో ప్రదర్శించారు.

చైనీస్, మలై, తాయ్, జపానీస్ భాషలలో విడుదలైన మొదటి తమిళ చిత్రంగా కబాలి చిత్రానికి ప్రత్యేకత ఉంది. చిత్రం మొదటి ప్రదర్శన చూడడానికి బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే అభిమానులకు బెంగళూరు నుంచి చెన్నైకి విమానసేవ ఏర్పాటు చేయడం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. వర్ధన అనే అమ్మాయి హీరో రజనీకాంత్‌కు దుస్తుల రూపకల్పన చేసింది. కథానాయకుని దుస్తులకు అవసరమైన వస్త్రాలు లండన్‌లో కొనుగోలు చేశారు. మలేషియాలో జరిగిన చిత్రీకరణకు అవసరమైన స్పోర్ట్ డ్రెస్‌లు సహజత్వం కోసం మలేషియాలో కొన్నారు.

Read Also : Top 10 Movies: టాలీవుడ్‌ హిస్టరీలో ఎక్కువ రోజులు ఆడిన మూవీస్‌ ఇవే..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు