కొందరు తరచూ అనారోగ్యాల (Vastu Tips Health) బారిన పడుతుంటారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా (Vastu Tips Health) ఇలా జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నా తరచూ జబ్బులు వేధిస్తుంటాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవడం ఎంత ముఖ్యమో వాస్తు సలహాలు (Vastu Tips Health) పాటించడం కూడా అంతే ముఖ్యమంటున్నారు వాస్తు నిపుణులు.
1. ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. మంచి ఆరోగ్యం, సిరిసంపదలతో తులతూగాలంటే వాస్తుపరమైన కొన్ని చిట్కాలను పాటించాలని సలహాలు ఇస్తున్నారు.
2. ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొళాయిల నుంచి నీరు కారకుండా చూసుకోవాలట. అలా కారుతూ ఉంటే ఇంట్లోని వ్యక్తుల ధనం కూడా అలాగే ఖర్చయిపోతుందని చెబుతున్నారు.
3. ధన నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. నైరుతి వైపు పడకగది ఉండాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
4. ఇంటికి నైరుతి దిశలో వీధి పోటు ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు తప్పవట.
5. ఆ ఇంటి ఇల్లాలికి సంవత్సరమంతా జబ్బులు సోకుతూనే ఉంటాయని చెబుతున్నారు. ఇంటికి వీధి పోటు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
6. ఒక వేళ తప్పని పరిస్థితుల్లో వీధి పోటు ఉండే ఇంట్లోనే నివాసం ఉండేటట్లయితే.. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పరిహారంగా సూచిస్తున్నారు.
7. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఉన్న భాగాన్ని టాయిలెట్ కోసం గానీ, వంట గది కోసం గానీ వినియోగించరాదట. ఇలా చేయడం వల్ల నాడీ, గుండె సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
8. ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. తులసిని పూజించడం వల్ల మానసిక సంతోషం చేకూరుతుందట.
9. తులసిని పూజించకపోవడం వల్ల మానసికంగా అస్థిరత వస్తుందని చెబుతున్నారు.
Vastu tips: ఇంట్లో అలాంటి సమస్యలా? పరిష్కారం ఇదే!
చాలా మంది తమ ఇళ్లలో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అనేక మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఇళ్లను వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని చెబుతుంటారు. ఇంట్లో పెట్టే వస్తువులను కూడా వాస్తు దోషాలు లేకుండా అమర్చుకోవాలని సలహాలు ఇస్తుంటారు పండితులు. సంతోషంగా జీవించడం, అభివృద్ధి, సుస్థిరత సాధించడానికి వాస్తు సలహాలు చాలా మంది అనుసరిస్తూ ఉంటారు.
1. ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి కొన్ని సంకేతాలుంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒక ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతుంటారు.
2. ఇలా జరుగుతుంటే కచ్చితంగా ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. ఇలా జరగడం వాస్తు దోషాల వల్లనే అని నిపుణులు చెబుతున్నారు.
3. ఓ కుటుంబంలో ఏ పని మొదలు పెట్టినా కలిసిరాకపోవడం వాస్తు దోషం వల్లనే జరుగుతుందని చెబుతున్నారు.
4. భార్యా భర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినడం లాంటివి జరుగుతుంటాయి.
5. సంతానం కలగకపోవడం, చదువుల్లో రాణించలేక ఇబ్బందులు ఎదుర్కోవడం, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం లాంటివి జరుగుతున్నాయంటే అది వాస్తు దోషం వల్లనే అని నిర్ధారించుకోవచ్చట.
6. ఇంట్లో చికాకులు తొలగాలన్నా, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నా వాస్తు పండితుల సలహాలు స్వీకరించి ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.
7. వాస్తు దోషాల నివారణకు ప్రస్తుతం చాలా చిట్కాలు ఉన్నాయని, వాటిని పాటించడం ద్వారా దోషాలు పోగొట్టుకోవచ్చని సూచిస్తున్నారు.
8. వాస్తు టిప్స్ పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు. వాస్తు సూచనలతో పాటు వ్యక్తుల లోపాలను సరిదిద్దుకోవడం కూడా ముఖ్యం.
Read Also : Tulasi Vastu Tips: తులసి చెట్టును ఇంట్లో ఏ దిక్కులో పెట్టాలి?