హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం వేదం అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. ప్రతి విషయాన్నీ క్షుణ్నంగా పరిశీలించి ఆకళింపు చేసుకుంటే మన జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా గడిపేయొచ్చు. మంచి విషయాలు పాటించడం, ఫాలో కావడం వల్ల మన కుటుంబంలో, జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయి. భగవంతుని ఆశీస్సులు పొందుతారు. వేదం చెప్పిన సారంలో కొన్నింటిని అయినా పాటిస్తే చాలు.. కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. పురాణ గ్రంథాల్లో సంధ్యా సమయాన (Evening things) చేయకూడని పనులు కొన్ని వివరించారు. వాటిని సాయంత్రం పూట (Evening things) చేయకుండా ఉంటే మేలు కలుగుతుంది.
1. సాయంత్రం సమయంలో ఇంట్లోని తలుపులు మూయకూడదని పెద్దలు చెబుతారు. తెరిచే ఉంచాలంటారు. ఎన్ని తలుపులుంటే అన్నీ తెరవాలి. ధనలక్ష్మీ దేవి మన ఇంట్లోకి వచ్చేది ఈ సమయంలోనేనట. అందుకే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే సాయంకాలం తలుపులు తెరిచి ఉంచాలట.
2. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, వృద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఇందులో కాస్త లోతుగా ఆలోచిస్తే ఉదయం, సాయంత్రం తలుపులు తెరిచి ఉంచుకోవడం వల్ల గాలి, వెలుతురు మన ఇంట్లోకి వస్తాయి. సూర్యరశ్మి ప్రవేశిస్తే ఇంట్లో సకల శుభాలూ కలుగుతాయి.
3. సాయంకాలం పూట సూదులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు లాంటివి ఇవ్వకూడదట. ఎవరి వద్ద నుంచి కూడా తీసుకోరాదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూలతలు, దుష్ట శక్తులు ప్రవేశిస్తాయట.
4. ఇంట్లోని వస్తువులను కూడా సాయంత్రం సమయంలో తొలగించరాదు. సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారం తీసుకోవడం ఆయుక్షీణానికి దారి తీస్తుందని చెబుతారు. మహాభారతంలో ఈ విషయం చెప్పారు.
5. అలాగే సాయంత్రం వేళల్లో తులసిని తాకరాదు. వాస్తవానికి తులసికి సాయంత్రం పూట దీపం చూపిస్తే సరిపోతుందట. సూర్యాస్తమయ సమయాన ఆర్థిక లావాదేవీలు కూడా చేయొద్దని చెబుతారు. దాన ధర్మాలకూ ఇది సమయం కాదు. ఉదయాన్నే చేసుకోవడం మంచిది.
అదృష్ట దేవత ఇక్కడే.. వెంటనే ఈ ఫొటో తెచ్చుకోండి..
1. వాస్తు శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. అనేక మంది ఆచరిస్తారు. మంచి ఫలితాలు పొందుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఎలాంటి చిత్రపటాలు పెట్టుకుంటే మంచి ఫలితాలొస్తాయో చాలా మంది వాస్తు పండితులు యూట్యూబ్ వేదికగా చెబుతుంటారు.
2. వాస్తు శాస్ర్తం ప్రకారం మీ ఇంట్లో 7 గుర్రాల ఫొటోను ఉంచుకుంటే అత్యంత శుభప్రదమట. ఈ ఫొటోను పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చట. చాలా మందికి 7 లక్కీ నంబర్ కూడా.
3. ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వాస్తు ప్రకారం నిర్మించుకోవడంతో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
4. మరికొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అలంకరణకు అందంగా ఉండటంతోపాటు వాస్తు బలం చేకూరుతుంది. ఇలాంటిదే 7 గుర్రాల చిత్ర పటం. పరుగెత్తే ఏడు గుర్రాలు ఉన్న పటం ఇంట్లో ఉంటే సకల శుభప్రదాయినిగా భావిస్తారు.
5. ఏడు సంఖ్యలో చాలా విశిష్టతలున్నాయి. పెళ్లి సమయంలో ఏడడుగులు, ఆకాశంలో ఏడు రంగుల ఇంద్రధనస్సు, సప్త సముద్రాలు, సూర్య భగవానుడి రథంలో ఏడు గుర్రాలు, శనైశ్చరుని సంఖ్య, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఉండే కొండలు కూడా ఏడే.. ఇలా ఏడు సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంది.
6. ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటాన్ని దక్షిణం వైపు గోడపై ఉంచుకోవాలి. చిత్రపటంలో గుర్రాలన్నీ ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి. వాటిలో ముఖం ఇంటి వైపు, గుమ్మం వైపు ఉండరాదు.
7. ఇంటి లోపలివైపు ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో ఉంచరాదు. వాస్తు ప్రకారమే ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగి సిరిసంపదలతో తులతూగుతారు.
8. లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. అలాగే ఇంటికి వాయువ్య దిశలో ఓ జత గుర్రాల విగ్రహాన్ని ఉంచుకోవచ్చు.
Read Also : Veedhi Potu : వీధిపోట్ల గురించి తెలుసా? కొన్ని చాలా ప్రమాదకరం అవేంటంటే..