నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు వాస్తు శాస్త్రంలో పరిష్కారం చూపించారు నిపుణులు. ముఖ్యంగా వీధి పోట్ల (Veedhi Potu) గురించి చాలా మందికి అనుమానాలు ఉంటాయి. వీటి నివారణకు (Veedhi Potu) మార్గాలు ఉన్నాయి.
1. వాస్తు శాస్త్రంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉంది. వీటిలో వీధి పోట్లు ఉన్న ప్రాంతాల్లో నివారణ మార్గాలను వాస్తు పండితులు సూచించారు.
2. దుకాణాలు పెట్టుకోవాలన్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా వీధి పోటు సమస్య చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది.
3. వీధికి ఎదురుగా ఉన్న షాపులు, ఇళ్లు తీసుకోవాలంటే చాలా మందికి భయం.
4. వీధిపోట్లలో అన్ని వీధిపోట్లూ అశుభం కాదని, కొన్ని మాత్రమే చాలా డేంజర్ అని పండితులు చెబుతున్నారు.
5. ఇంటికి ముందుగానీ, పక్కన కానీ రోడ్లు ఉన్నప్పుడు ఇంటికి ఎదురుగా వీధి ఉంటే అలాంటి వాటిని వీధిపోటుగా పిలుస్తారు.
6. ఇల్లు గానీ, దుకాణం గానీ ఏ మూలలోనూ రోడ్డు మధ్యకు వచ్చేలా ఉండరాదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
7. కొత్తగా ఇల్లు కట్టుకొనే వారు ఇలా వీధి పోటు లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
8. తూర్పు వీధిపోటు ఉంటే ప్రభుత్వంతో నిత్యం భయం కలుగుతూ ఉంటుందట.
9. ఆగ్నేయం వైపు వీధి పోటు ఉంటే కష్టాలు అనుకోకుండా వచ్చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ధనం నిలబడదట.
10. నైరుతి వీధి పోటుతో మానసిక ఆందోళన కలిగేలా చేస్తుందని వాస్తు పండితులు స్పష్టం చేస్తున్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి.
11. ఉత్తర వాయువ్యంలో వీధి పోటు వల్ల ఇంట్లోని స్త్రీలపై చెడు దృష్టి పడుతుందని స్పష్టం చేస్తున్నారు.
12. గర్భిణులు ఉంటే తరచూ వ్యాధులు ప్రబలుతాయి. యువకులకు పెళ్లిళ్లు జరగడం కష్టం అవుతుంది.
13. దక్షిణ మధ్య వీధి పోటు వల్ల ధన నష్టం తప్పదు. కుటుంబంలోని వ్యక్తులు ప్రమాదవశాత్తు చనిపోవడం లాంటివి జరుగుతాయి.
14. పశ్చిమ నైరుతి వీధి పోటుతో ఇంట్లోని మగవారిపై ప్రభావం చూపుతుందట. అన్నింటికంటే దక్షిణ మధ్య వీధిపోటు చాలా ప్రమాదకరం.
Also Read : Health Tip 30 Years : 30 ఏళ్లకే చర్మంపై ముడతలు పడుతున్నాయా? ఈ టిప్స్ మీకోసమే!
[…] […]