ఉదయాన్నే కార్యాలయాకు వెళ్లే వారు సాధారణంగా అలారం సెట్ చేసుకొని నిద్ర లేస్తూ ఉంటారు. ఉదయం 10 గంటలపైన ఉద్యోగానికి వెళ్లాల్సిన వారికి పెద్దగా అవసరం ఉండకపోయినా, మార్నింగ్ ఎర్లీగా ఆఫీసులకు వెళ్లే వారికి అలారం తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, అలారం ఎన్ని సార్లు మోగినా కొందరు ఇంకాసేపు పడుకుందాం… అనే రకంగా లేజీగా (Lazy) వ్యవహరిస్తుంటారు. తీరా ఆఫీసుకు టైమయ్యే సరికి లేజీని (Lazy) పక్కనపెట్టేసి ఉరుకులు పరుగులు తీస్తుంటారు.
బద్దకం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. మరికొందరు బద్ధకం వీడి అలారం మోగిన వెంటనే లేచి స్నానాదులు కానిచ్చేసి కాస్త ముందుగానే ఆఫీసుకు చేరుకుంటూ ఉంటారు. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం శరీరానికి, ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ పాత్ర పెరిగిపోవడంతో అందరూ రాత్రిళ్లు నిద్రపోకుండా సెల్‌ఫోన్లు చూస్తూ ఎక్కువ సమయం వృధా చేసుకుంటూ ఉంటారు.
రోజూ కనీసం 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలంటే రాత్రి 11 గంటల్లోపు పడుకోవాలి. మొబైల్ వాడకం రాత్రి పూట వీలైనంత వరకు తగ్గించేయాలి. మొబైల్ నుంచి వెలువడే కిరణాలు కంటికి ప్రమాదకరంగా మారతాయని చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా మొబైల్‌ను పక్కన పెట్టేసి కొన్ని రోజులపాటు నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల త్వరగా నిద్ర పట్టి ఉదయం తొందరగా నిద్ర లేవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బద్దకం పూర్తిగా తొలగిపోవడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుందని స్పష్టం చేస్తున్నారు.
అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చూసుకుంటూ ఉదయాన్నే ఆలస్యంగా లేవడం కొందరికి రివాజుగా మారి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే అనేక సమస్యల బారిన పడుతుంటారు. బద్ధకం వీడి రాత్రి త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేవడం కోసం కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
కంటి నిండా నిద్రపోవడం వల్ల బాడీకి కావలసినంత విశ్రాంతి లభిస్తుంది. దాంతో మనం ఉదయం లేవాల్సిన సమయం కంటే ముందుగా దానికి అనుగుణంగా మనం నిద్ర లేయవచ్చు. రాత్రి వీలైనంత త్వరగా పడుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో మొబైల్ స్క్రీన్ లకు అతుక్కుపోతూ సమయం ఎంత అయ్యిందో కూడా పట్టించుకోకుండా వాటితోనే కాలం గడిపేస్తుంటారు. అర్ధరాత్రి సమయం దాటాక చాలా మంది నిద్ర పోతూ ఉంటారు.
రోజూ పడుకునే ముందు మొబైల్స్ వీలైనంత వరకు దూరం పెట్టాలి. ఇలా నిద్రపోవడం అలవాటు చేసుకుంటూ ఆ విధానానికి మన శరీరం అలవాటు పడిపోతుంది. ఇది రోజూ ఆటోమేటిగ్‌గా జరగాల్సిన పని. దాంతో మనం అనుకున్న సమయానికి నిద్ర లేవడంతో పాటు బద్ధకం కూడా పోతుంది. చాలామంది ఉదయం త్వరగా లేచినప్పటికీ కూర్చుంటూ నిలబడుతూ బద్దకంగా పనులు చేస్తూ ఉంటారు. అటువంటివారు ప్రతిరోజు నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం చేయడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల త్వరగా నిద్ర నుంచి లేచేందుకు వీలవుతుంది. దీంతోపాటు బద్ధకం కూడా పరార్ అవుతుంది.
Read Also : Mundan Ceremony: పుట్టు వెంట్రుకలు ఏ సమయంలో ఇవ్వాలి? కలిగే ప్రయోజనాలేంటి?