Wife and Husband: భర్త మీ మాట వినేలా చేయాలంటే ఏం చేయాలి?

Wife and Husband: పురుషుల తమ భార్యలకు (Wife and Husband) చాలా వరకు సమయం కేటాయించని పరిస్థితులు ఉంటాయి. దాంపత్య జీవితంలో భాగస్వామికి (Wife and Husband) కాస్త సమయం కేటాయిస్తూ ఉండాలి. అప్పుడే మనస్పర్ధలు లేకుండా సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీసు పనుల్లో నిమగ్నం అయితే ఇక భార్యా, పిల్లలతో ఎప్పుడు గడిపేది? ఇలాంటి సందర్భాల్లో భార్యా భర్తల మధ్య బంధాలు కాస్త బలహీనపడే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో భార్యలు.. భర్తల్ని కంట్రోల్‌లో ఉంచుకొని తమకు సమయం కేటాయించేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. భార్యలు కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా భర్తలు తమను అమితంగా ప్రేమించేలా, టైమ్‌ స్పెండ్‌ చేసేలా చూసుకోవచ్చు. వైవాహిక బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, సమయం కేటాయించడం ముఖ్యం.

రాత్రిపూట భోజనం సందర్భంగా కాస్త రిలాక్స్‌గా మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడూ బయటకు వెళ్లి క్యాండిల్‌ లైట్‌ భోజనం తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. మనసులో ఉన్న కొన్ని విషయాలను, మీతో గడపాల్సిన ప్రాముఖ్యాన్ని భర్తకు వివరించాలి. అప్పుడు వారు కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. మీ భర్తపై మీకు అనుమానంగా ఉంటే సడన్‌ సర్‌ప్రైజ్‌ పేరిట ఆఫీసుకు వెళ్లి పరిశీలించుకోవచ్చు. అయితే, ఇలా చేయడం వల్ల మనస్పర్ధలు కూడా పెరిగే చాన్స్‌ లేకపోలేదు. భర్తకు అప్పుడప్పుడూ దూరంగా వెళ్లడం అంటే.. పుట్టింటికి వెళ్లడం లాంటివి చేయడం ద్వారా భర్తలో మార్పు తీసుకొచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేయవచ్చు.

భర్త బిజీ షెడ్యూల్ కారణంగా భార్య అతనితో మాట్లాడలేకపోయే సందర్భాలు వస్తాయి. ఇలాంటి సమయంలో అతని పని గురించి మరింత సమాచారం సేకరించలేకపోతే, ఒక రోజు భర్తకు చెప్పకుండా ఆఫీసుకు వెళ్లాలి. మీరు ఫోన్ చేస్తే స్పందించనప్పుడు నిజంగానే ఆఫీసులో బీజీగా ఉన్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ఆఫీసుకు వెళ్తే మంచిది. అప్పుడు భార్యకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

భర్త వైవాహిక జీవితంలో భార్యకు సమయం ఇవ్వకపోతే, అతనిపై శ్రద్ధ పెట్టడం మానేస్తే కాస్త మంచి ఫలితాలు చూడొచ్చు. అయినా కూడా మార్పు రాకపోతే పుట్టింటికి వెళ్లిపోతానని చెప్పాలి. వారు ఎంత బిజీగా ఉన్నా వారితో మాట్లాడాలి. మీరు ఇకపై వారితో ఉండటానికి ఇష్టపడరు ఎందుకంటే మీ కోసం సమయం లేని భాగస్వామితో జీవించడం జీవితం వృధా అవుతుంది. అప్పుడు వారు మిమ్మల్ని కోల్పోతారని భయపడితే, వారు కచ్చితంగా మీకు క్షమాపణ చెబుతారు. మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. లేదా కొన్ని రోజులు ఒంటరిగా జీవిస్తారు. తర్వాత విసుగు చెందినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లడానికి వాళ్లే తిరిగి వస్తారు.

ఇంటికి వచ్చిన తర్వాత భార్యగానీ, భర్త గానీ ఫోన్‌ కాల్స్‌లో ఎక్కువ సమయం గడపడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే ఓ పది నిమిషాలు మాట్లాడి తర్వాత ఇక ఫ్యామిలీ మెంబర్స్‌కు సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. ఆఫీసుకు వెళ్లినా మీ భర్తకు ఫోన్‌ చేసి మాట్లాడటం లాంటివి తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడటం, సమయం కేటాయించడం చేయడానికి వీలవుతుందని చెబుతున్నారు.

Read Also : Vitamin B12: విటమిన్‌ బీ12 లోపిస్తే వచ్చే సమస్యలు తెలుసా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles