పుష్టికరమైన ఆహారం తీసుకోవడం ప్రతి ఒక్కరికీ ఇప్పుడు కష్టంగా మారుతోంది. మార్కెట్లో దొరికే వాటితోనే సరిపెట్టుకుంటుంటారు చాలా మంది. మారిన జీవన శైలి, పోషకాహార లోపం, తగినంత నిద్ర లేకపోవడం లాంటి సమస్యలు మనిషిని వేధిస్తున్నాయి. అనారోగ్యానికి కారకాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విటమిన్లు కలిగిన ఫుడ్‌ను తీసుకోవడం ద్వారా అనారోగ్యానికి చెక్ పెట్టవచ్చు. మన శరీరానికి విటమిన్ బీ12 (Vitamin B12) చాలా అవసరం.
బాడీకి అవసరమైన విటమిన్లు, శక్తిని ఇస్తుంది. మన శరీరంలో విటమిన్ బీ12 (Vitamin B12) తగ్గితే అనేక సమస్యలు చుట్టుముడతాయి. శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరక, మానసిక సమస్యలకు దారి తీస్తుంది. మన శరీరంలో విటమిన్ బీ12 తగ్గితే బహీనత వచ్చేస్తుంది. కాళ్లు, చేతులు బలహీనంగా మారతాయి. చేతులు, కాళ్లు సరిగా కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
తరచూ డిప్రెషన్‌కు గురవుతుంటారు. ఫలితంగా ఏపనినీ సక్రమంగా చేయలేకపోతారు. జుట్టు రాలడం లాంటి సమస్యలు కూడా వచ్చి చేరుతాయి. గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ, పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధులు ప్రబలుతాయి. గర్భిణుల్లో అయితే పిండం ఎదుగుదలలో కూడా లోపాలు కనిపిస్తాయి. విటమిన్ బీ12 పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.
విటమిన్ బీ12 లోపం కారణంగా గర్భిణులలోనూ చాలా ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిండం ఎదుగుదలకు విటమిన్ బీ 12 లోపం శాపంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణులు ఎప్పటికప్పుడు విటమిన్ B12 లెవల్స్‌ను పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
మన బాడీలో విటమిన్ బీ 12 లోపం ఉన్నట్లయితే రక్తహీనతకు దారితీసే అవకాశాలూ ఉన్నాయి. అయితే, ఇందుకు మరిన్ని టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. రక్తహీనత కారణంగా మనిషి ఏ పనిపై సక్రమంగా దృష్టి సారించలేకపోతాడు. మరోవైపు ఇది మరిన్ని జబ్బులకు కారణం కాగలదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. విటమిన్ బీ12 లోపానికి మెయిన్ రీజన్ అది లభించే పదార్థాలను తీసుకోకపోవడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
విటమిన్ బీ12 తగ్గడం వల్ల రక్తహీనత సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎప్పటికప్పుడు ఈ విటమిన్ టెస్టులు చేయించుకుంటే మంచిది. మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఎముక మజ్జ పరీక్ష, గ్యాస్ట్రో-ఎండోస్కోపీ, రక్త పరీక్షలు వంటి వాటి ద్వారా విటమిన్ B12 లోపం ఉందా లేదా గుర్తించవచ్చని చెబుతున్నారు. దీన్ని అధిగమించాలంటే మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు లాంటి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. ఆల్కహాల్ మానేయడం, జీవనశైలిలో మార్పులు చేసి ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది.
Read Also : Aluminum Foil Use: అల్యూమినియం ఫాయిల్‌తో చాలా డేంజర్..!