Mundan Ceremony: పుట్టు వెంట్రుకలు ఏ సమయంలో ఇవ్వాలి? కలిగే ప్రయోజనాలేంటి?

పిల్లలకు పుట్టు వెంట్రుకలు (Mundan Ceremony) ఇంటిదేవుడికి ఇవ్వడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. పుట్టిన పిల్లలకు ఏడాది గడిచేలోపు పుట్టు వెంట్రుకలు (Mundan Ceremony) సమర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు ఇలా చేస్తారనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. ఎందుకు తలనీలాలు (Mundan Ceremony) సమర్పిస్తారు? దాని వల్ల ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు.

మనకు ఇంటి దేవుడు లేదా ఇష్టమైన భగవంతుడికి పుట్టువెంట్రుకలు సమర్పిస్తుంటాం. అయితే ఇలా పిల్లల వెంట్రుకలను దేవుడికి ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దేవుడికి తల నీలాలు ఇవ్వడం ఒక సంప్రదాయంగా చాలా కాలం నుంచే వస్తోంది. పురాణాల ప్రకారం మన తల వెంట్రుకలు పాపాలకు నిలయం అంటారు.

అయితే, ఆ వెంట్రుకలను భగవంతుడికి సమర్పించడం వల్ల మన పాపాలు దేవుని సన్నిధిలో తొలిగించినట్లు అవుతుందని పెద్దలు చెబుతారు. శిశువు జన్మించినప్పుడు మొదటగా తన తలను నేలకు ఆన్చి బయటకు వస్తాడు. అంటే పుట్టేటప్పుడు ముందుగా తల వచ్చి నేలను తాకుతుంది. అయితే ఆ శిశువు తల వెంట్రుకకు గత జన్మ పాపాలు అంటుకొని ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి.

మానవ శరీరంలోని శిరోజాలు అనేక పాపాలకు నిలయం అని పెద్దలు చెబుతుంటారు. వాటిని తొలగించడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, శిశువు తనతోపాటు పూర్వజన్మ వాసనలను వెంట్రుకల రూపంలో తీసుకు వస్తాడని పెద్దలు చెబుతారు. అనేక విషయ వాంఛలను మోసుకొని వస్తారట.

ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే కేశఖండన జరగడం ఆనవాయితీ. కొందరు తొమ్మిది నెలలు పడగానే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీపిస్తుంటారు. మరికొందరు 11 నెలలప్పుడు కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. శిశువుకు తొలిసారి వెంట్రుకలు తీయించడం వల్ల గత జన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా పుట్టు వెంట్రుకలు సంవత్సరంలోపు లేదా మూడో ఏట లేదా ఐదేళ్లప్పుడు తీయిస్తుంటారు.

సాధారణంగా ఉత్తరాయన పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మంచిదని పండితులు చెబుతారు. మగ పిల్లలకు సరిమాసంలో, ఆడ పిల్లలకు బేసి మాసంలో కేశఖండన చేయించాలని సూచిస్తున్నారు పెద్దలు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు కేశఖండన జరిపించడానికి అనుకూలమైన వారాలుగా చెబుతారు. ఈ వారాలలో మధ్యాహ్నం 12 గంటల్లోపు పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమం పూర్తి చేసుకోవాలట. గురు, శుక్ర మౌఢ్యాల్లో ఈ పని చేయరాదని స్పష్టం చేస్తున్నారు. అలాగే శిశువు తల్లి గర్భిణిగా ఉండి 5 నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదని సూచిస్తున్నారు.

Read Also : Vastu for Positive Energy: ఇంట్లోంచి నెగిటివ్‌ ఎనర్జీని పంపేయాలా? ఇలా చేయండి!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles