చెట్లు మనిషి జీవితానికి ముడిపడి ఉన్న ప్రధాన కారకాలు. మానవుని ఉనికికి ప్రధాన కారణం చెట్లే. కాలుష్యాన్ని తగ్గించి మనిషికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో చెట్లు కీలక భూమిక పోషిస్తాయి. హిందూ సంప్రదాయంలో చాలా చెట్లను దేవతలుగా (Spiritual Plants) భావించి పూజిస్తారు. ఇలా కొన్ని చెట్లను పూజించడం (Spiritual Plants) వల్ల మానవాళికి సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు.
ముఖ్యంగా తులసిని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. తులసి చెట్టుతో పాటు మర్రి చెట్టును కూడా నిత్యం పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మర్రి బెరడులో విష్ణువు, మూలంలో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని చెబుతారు. రోజూ మర్రి చెట్టును పూజించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం ఖాయమని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్య జీవితంలో కలిగే కష్టాలు తొలగిపోవాలని అనేక చెట్లను చాలా మంది పూజిస్తుంటారు. మరి ఏ చెట్లను పూజించడం వల్ల మంచి జరుగుతుందో తెలుసుకోవడం కూడాముఖ్యం. చాలా మంది ఇళ్లలో తులసి చెట్టును ప్రతి రోజూ పూజిస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు పూజ తర్వాత నెయ్యి దీపం వెలిగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సంపద పెరిగి లక్ష్మి దేవి ఆనందంగా మన ఇంట్లోకి వస్తుందని చెబుతున్నారు. నిత్యం తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సంతానం కలగని వారు మర్రి చెట్టును పూజించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే పిల్లలు పుడతారని చెబుతున్నారు. మరోవైపు పూజ గదిలో రోజూ సాయంత్రం పూజ చేసిన తర్వాత శమీ వృక్షం కింద దీపాన్ని వెలిగించి రావాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరిగి, వ్యాపారంలో వృద్ధి జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకా ప్రతి శనివారం ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని గ్రహ స్థితి నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు రావి చెట్టును కూడా పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇంకా అరటిచెట్టును కూడా పూజించవచ్చు.
తులసిని పూజించడం వల్ల విష్ణువును అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. అలాగే మర్రిచెట్టు ను పూజించాలి. మర్రి చెట్టుని బ్రహ్మ, విష్ణువు, శివుని భావించడంతోపాటు విష్ణు బెరడులో బ్రహ్మ మూలంలో, శివుడు కొమ్మలలో, ఉంటారు అని భావిస్తారు. ప్రతిరోజు మర్రి చెట్టును పూజించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడంమే కాకుండా సంతానం కూడా కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
అదేవిధంగా పూజ గదిలో రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత శమి చెట్టు కింద దీపాన్ని వెలిగించాలని పండితులు చెబుతున్నారు. తప్పకుండా చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరిగి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుతారని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి శనివారం రోజు ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని గ్రహ స్థితి, శని ప్రభావం నుంచి ఉపశమనం పొందగలుగుతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Read Also : Vastu tips for House Clean: ఇంటి శుభ్రతలో వాస్తు టిప్స్ పాటిస్తే శుభప్రదం..