సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Telangana, Trending/Viral

Hyderabad Biryani: ఆన్‌లైన్‌లో కుళ్ళిన బిర్యానీ దందా.. జొమాటో ఆర్డర్లతో కస్టమర్లకు షాక్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 8 ఏప్రిల్ 2026

Hyderabad Biryani: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో జరుగుతున్న కుళ్ళిన బిర్యానీ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. నగరంలోని జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని, బంజారాహిల్స్ ప్రాంతం నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ కస్టమర్లకు డెలివరీ చేస్తున్న ఘటన బయటపడింది.

మూడు రోజుల పాత బిర్యానీ నిల్వ
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జీడిమెట్లలోని ఒక హోటల్‌లో తయారు చేసిన సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లను మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ బిర్యానీ ప్యాకెట్లను తర్వాత ఓవెన్‌లో వేడి చేసి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ఆన్‌లైన్ విక్రయాలు
పోలీసుల సమాచారం ప్రకారం, హోటల్ యజమాని ఇర్ఫాన్ జీడిమెట్లలో బిర్యానీ తయారు చేసి, బంజారాహిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి “లక్కీ బిర్యానీ అండ్ షవర్మా” పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసింది.ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ Zomato ద్వారా కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు, అదే పాత బిర్యానీని వేడి చేసి పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఫ్రిడ్జ్‌లో ఎలుకల మధ్య నిల్వ
దర్యాప్తులో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన బిర్యానీ ప్యాకెట్లు ఎలుకలు తిరిగే పరిస్థితుల్లోనే ఉంచినట్లు గుర్తించినట్లు సమాచారం. అలాంటి బిర్యానీని కస్టమర్లకు డెలివరీ చేయడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని అధికారులు హెచ్చరించారు.

కస్టమర్ ఫిర్యాదుతో బయటపడిన ఘటన
జొమాటోలో ఆర్డర్ చేసిన ఒక కస్టమర్‌కు కుళ్ళిపోయిన బిర్యానీ డెలివరీ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పేరుతో ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఆహార భద్రత అధికారులతో కలిసి మరిన్ని తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

కస్టమర్లకు హెచ్చరిక
ఈ ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసే సమయంలో రెస్టారెంట్ రేటింగ్స్, రివ్యూలు, హైజీన్ పరిస్థితులు పరిశీలించాలని సూచించారు.

ఇవీ చ‌ద‌వండి: Hyderabad Biryani : 2025లోనూ ‘బిర్యానీ క్యాపిటల్’ హైదరాబాద్.. స్విగ్గీ రిపోర్ట్‌లో రికార్డుల మోత
Indian style Biryani: ఇండియన్ స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ.. తప్పక ట్రై చేయండి!
SBI Report : 2026 GDP వృద్ధిపై SBI సంచలన అంచనా.. కొత్త బేస్ ఇయర్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపు?

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading