HomeAndhra PradeshRavindranath Reddy: రాయలసీమపై చంద్రబాబుకు తొలి నుంచి కక్ష సాధింపే

Ravindranath Reddy: రాయలసీమపై చంద్రబాబుకు తొలి నుంచి కక్ష సాధింపే

Ravindranath Reddy: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నాడని వైయస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) ఆరోపించారు.

కొప్పర్తి సెజ్ కి వచ్చిన MSME టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమన్నారు. ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమేనని అభివర్ణించారు. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.

మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా మాట్లాడుతూ.. కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చింది..? అని ప్రశ్నించారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను చంద్రబాబు అమరావతికి తీసుకెళ్ళిపోతున్నాడని, పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపాడన్నారు.

రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం అని అంజద్ బాషా ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కడప జిల్లా నుంచి కొప్పర్తి సెజ్ ను అమరావతికి తరలించడంపై రాయలసీమ టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని వైయస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచి చంద్రబాబుకు రాయలసీమపై ప్రేమ లేదంటున్నారు. అలాగే కర్నూలు (Kurnool) జిల్లాకు కేటాయించిన న్యాయ విశ్వ విద్యాలయాన్ని (Law University) కూడా చంద్రబాబు (Chandrababu) అమరావతికి (Amaravathi) తరలించుకుపోయారని మండిపడుతున్నారు. సీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఇక్కడి యువతకు ఉద్యోగాలు (Jobs) లేకుండా దారుణంగా మారుస్తున్నారని వైసీపీ (YSRCP) మండిపడుతోంది.

Read also: YSRCP: వైయస్సార్ సీపీ నేతలకు సుప్రీం కోర్టులో ఊరట
YS Jagan: పాలన కుప్పకూల్చి దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు: జగన్ ధ్వజం
YS Jagan: నేను భారతీయుడిని.. నా మతం మానవత్వం: వైయస్ జగన్
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం? 
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు