Actor Divi: తెలుగు టెలివిజన్ లో కామెడీకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షోలలో జబర్దస్త్ ఒకటి. కంటెంట్ పై కొన్ని విమర్శలు వచ్చినా, ఈ షోకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఈ కామెడీ షోను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఈ షో ద్వారా పరిచయమైన అనేక మంది ఆర్టిస్టులు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు.
హీరోలు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లుగా ఎదిగిన వారు కూడా ఈ షో నుంచే వచ్చిన వారే. ఇదే షోకు యాంకర్‌గా చేసిన అనసూయ భరద్వాజ్ కూడా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా కొనసాగుతోంది.
అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. బిగ్ బాస్ ఫేమ్ దివి వద్త్యకు ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా అవకాశం వచ్చిందట. కానీ ఆ ఛాన్స్‌ను ఆమె స్వయంగా వదులుకున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తన అనుభవాన్ని ఇలా చెప్పింది.
“అనసూయ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల షోకు రాలేకపోయినప్పుడు జబర్దస్త్ టీమ్ నన్ను సంప్రదించింది. యాంకరింగ్ చేస్తారా అని అడిగారు. కానీ నాకు యాంకరింగ్ రాదనే భయం ఎక్కువగా ఉండడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాను” అని తెలిపింది.
అంతేకాకుండా, కొంతకాలం తర్వాత మళ్లీ అదే షో నుంచి అవకాశం వచ్చిందని చెప్పింది.
“అనసూయ షో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మళ్లీ నన్ను యాంకర్‌గా చేయమని అడిగారు. కానీ అప్పటికే నాకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. యాంకరింగ్ చేయాలా? సినిమాలపై ఫోకస్ చేయాలా? అనే డైలమాలో పడ్డాను” అని తెలిపింది.
ఈ నిర్ణయంపై తన స్నేహితుల అభిప్రాయం కూడా తీసుకున్నట్లు దివి చెప్పింది.
“కొంతమంది యాంకరింగ్ చేయమన్నారు. మరికొందరు మాత్రం సినిమాలపైనే దృష్టి పెట్టమన్నారు. చివరికి సినిమాల కోసం ప్రయత్నించాలనే నిర్ణయం తీసుకుని ఆ అవకాశం వదిలేశాను” అని చెప్పింది.
చివరగా ఆమె కొంచెం ఎమోషనల్ అవుతూ…
“ఆ టైంలో ఆ ఛాన్స్ తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో” అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది. ప్రస్తుతం దివి వద్త్య సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే జబర్దస్త్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌ను మిస్ కావడం ఆమె కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు.
ఇవీ చదవండి: Actor Divi : పబ్ ఈవెంట్‌లో చేదు అనుభవం.. షాకింగ్ విషయం వెల్లడించిన దివి వైద్య
Ashwini Sri: ముఖంపై గాయాలతో కనిపించిన అశ్విని శ్రీ.. ఏం జరిగిందో వీడియోలో చెప్పిన అమ్మడు






