బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

The scariest horror movie: ప్రపంచంలోనే అతి భయంకరమైన హర్రర్ మూవీ.. 100లో 99 మంది చూడలేరు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 7 ఏప్రిల్ 2024

The scariest horror movie: హర్రర్‌ సినిమాలను చాలా మంది ఆసక్తికరంగా తిలకిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వివిధ అంశాలపై వందలాది సినిమాలు చేస్తుంటారు. అందులో హర్రర్‌ మూవీస్‌ కూడా ఉంటాయి. కొన్నేళ్లుగా అనేక దేశాల్లో హర్రర్‌ మూవీస్‌ ఎక్కువగా తీస్తున్నారు. అయితే, వాటికి జనాదరణ కూడ అదే స్థాయిలో ఉంటోంది. కానీ ప్రేక్షకుల్లో పలువురు ఇలాంటి సినిమాలు చూడాలంటే చచ్చేంత భయపడతారు.

గ్రుడ్జ్, అన్నాబెల్లె లాంటి అనేక హాలీవుడ్ సినిమాలు ఈ జాబితాలోనే ఉన్నాయి. అయితే, ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఓ సినిమా ఇటీవల ప్రజలను బాగా భయపెట్టేసింది. ఈ సినిమాను ఎవరు చూస్తున్నారో, ఇది ప్రపంచంలోనే భయంకరమైన హారర్ మూవీ అని నమ్మడం గ్యారెంటీ. 100 మందిలో ఒక్కరూ మాత్రమే దీన్ని చూడగలరట. బలహీన గుండె కలిగినవాళ్లు ఈ మూవీకి దూరంగా ఉండాలని చిత్ర బృందం, నిపుణులు సలహా ఇచ్చారు.

డైలీ స్టార్ అనే వార్తా వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. స్పానిష్ సినిమా “వెరోనికా” (veronica horror movie) 2017 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైంది. ఇది 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 1991లో మాడ్రిడ్‌లో ఓ యుక్త వయసులో ఉన్న అమ్మాయి తన తమ్ముళ్లను చూసుకోవడానికి ఇంటి దగ్గర వదిలివేస్తారు. కానీ ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. అనంతరం ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి.

గుడ్‌ రేటింగ్
నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్‌ అయిన ఈ చిత్రాన్ని 100 మందిలో ఒకరు మాత్రమే చూడగలరట. చాలా మంది ప్రేక్షకులు ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేశారు. ఈ మూవీకి పాకో ప్లాజా డైరెక్షన్‌ చేశారు. ఫెర్నాండో నవారో, కోరల్ క్రజ్ కూడా ఈ సినిమాకి సహ రైటర్లుగా ఉన్నారు. ఈ మూవీలో సాండ్రా ఎస్కాసినా, బ్రూనా గొంజాలెస్, క్లాడియా ప్లేసర్ యాక్ట్‌ చేశారు. ఈ సినిమా IMDbలో 10కి గానూ 6.2 స్టార్ రేటింగ్‌ సొంతం చేసుకుంది.

వాస్తవ కథ ఆధారంగా తెరకు..
ఈ మూవీ ఎస్టీఫానియా గుటిరెజ్ లాజారో అనే నిజమైన 18 ఏళ్ల అమ్మాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఆ యువతి ఒక భయంకరమైన గేమ్ ఆడేది. దాని ద్వారా చనిపోయిన వారితో మాట్లాడుతుండేది. ఇలా చేయడానికి మధ్యలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆమె ఒకప్పుడు ఆత్మతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది.

6 నెలల అనంతరం ఎస్టీఫానియాకు మూర్ఛ, భయబ్రాంతి కలగడం మొదలైంది. చాలా సార్లు ఆమె తన సోదరులపై తీవ్రంగా కోపం వ్యక్తం చేసేది. తన రూమ్‌ ముందు దుష్టశక్తులు వెళ్లడం చూసేదాన్నంటూ చెప్పేది. 1991లో ఎస్టీఫానియా మృతదేహం గదిలో కనుగొన్నారు. కానీ మరణానికి కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు.

ఇవీ చదవండి: Family Star: ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌ రిలీజ్‌.. మృణాల్, విజయ్‌ దేవరకొండ హిట్‌ గ్యారెంటీనా?
Family Star Movie Review: ‘ఫ్యామిలీ స్టార్’తో దేవరకొండ మెప్పించాడా? సినిమా రివ్యూ..
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading