Neena Gupta: బాలీవుడ్ హీరోపై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో తనకు ఇష్టమైన పాత్రలుచేస్తూ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా ఎదిగారు నటి నీనా గుప్తా (Neena Gupta). నటనలో క్యారెక్టర్ల ఎంపికతో పాటు నిజ జీవితంలో ఆమె వ్యవహార శైలి కూడా ముక్కు సూటిగా ఉంటాయనడంలో సందేహం లేదు. ట్రెండ్, ఇమేజ్ లకు తలొగ్గకుండా నచ్చిన పాత్రలనే చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు నీనా గుప్తా(Neena Gupta). తన పర్సనల్ లైఫ్ కు, వృత్తి జీవితానికి పోలిక లేదని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
తాను వేసుకొనే డ్రెస్సులను బట్టే తనకు బోల్డ్ క్యారెక్టర్లు, వ్యాంప్ క్యారెక్టర్లు ఇచ్చే వారని నీనా గుప్తా చెప్పింది. ఈ నేపథ్యంలో పలువురు దర్శకులు నాకు ఎలాంటి పాత్రలివ్వాలనే సందేహంలో ఉండేవారని నీనా తెలిపారు. తాను మోడ్రన్ ఉమనా, లేక వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుతానా అనే ప్రశ్నలు వారిని తొలిచేవని తెలిపారు. టెలివిజన్ రంగంలో తాను పద్ధతిగా ఉండే తల్లి, సోదరి పాత్రలు చేశానని వెల్లడించింది.
నీనా గుప్తా సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్ లో తనకు ఇప్పటి వరకు చేసిన రోల్స్ అన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పారు. అయితే, ఓ విషయం మాత్రం తనకు నచ్చడం లేదని నీనా గుప్తా చెప్పింది. తాను వేసుకొనే బట్టలను బట్టి తన క్యారెక్టర్ ను డిసైడ్ చేయడం సరికాదని హితవు పలికింది. ఈ విషయంలో మీడియా, సినీ వర్గాలను ఆమె తీవ్రంగా తప్పు పట్టింది.
తనను మీడియానే బోల్డ్ ఉమెన్ గా ముద్ర వేసిందని నీనా ఆరోపించారు. ఈ నేపథ్యంలో దర్శకులంతా తనకు నెగిటివ్ రోల్స్ మాత్రమే ఇవ్వడానికి ప్రాముఖ్యం ఇచ్చే వారని నీనా వాపోయారు. యాక్టర్ అంటే ఎలాంటి పాత్రలైనా చేయగలగాలని చెప్పారు. ఓ సినిమాలో డాక్టర్ పాత్ర చేయాల్సి వస్తే అందులో నిజంగానే వైద్యులను తెచ్చి షూటింగ్ చేయరు కదా? అని ప్రశ్నించింది. బాదాయి హో సినిమా టైమ్ లో తనను తీసుకోవడానికి నటుడు ఆయుష్మాన్ ఖురానా నిరాకరించారంటూ ఆరోపణలు గుప్పించింది.
నీనా గుప్తా 1959 జూన్ 4న జన్మించారు. భారతీయ సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాతగా ఆమె పేరుగాంచారు. ఈమె 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. నీనా గుప్తా కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్‌జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించడంలో పాపులర్ అయ్యారు.
నీనా గుప్తా 1980లలో ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్స్ తో బంధం ఏర్పరచుకుందనే ప్రచారం ఉంది. మసాబ గుప్తా అనే కుమార్తెకు జన్మనిచ్చిందట. ఈమె అలోక్ నాథ్, సారంగ దేవ్‌లతో కూడా వివాహేతర సంబంధాలను కొనసాగించిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. 2008లో ఢిల్లీలో స్థిరపడిన వివేక్ మెహ్రా అనే ఛార్టెడ్ అకౌంటెంట్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని కథనాలు వచ్చాయి.
Read Also : NTR: రామ్ చరణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ త్యాగం!