NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) మధ్య స్నేహ బంధం ఎలాంటిదో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో రుజువైంది. ఈ చిత్రంలో వీరు కలిసి నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అయితే, ఈ సినిమాలో రాజమౌళి చూపించింది కొంతేనని, నిజ జీవితంలో సైతం వీరిద్దరి మధ్య సినిమాకు మించి అనుబంధం ఉందని తాజాగా కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆర్‌ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా వీరి స్నేహ బంధం ఎలాంటిదో అందరూ చూశారు.
తాజాగా టాలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఓ కొత్త విషయం తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఓ త్యాగం చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్టును ఇటీవల ఓకే చేశారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలోని ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే బుచ్చిబాబుకు డేట్స్ ఇస్తానని చెప్పాడటన ఎన్టీఆర్. దీంతో ఇక తన గురువు సుకుమార్ వద్దకు వెళ్లి పుష్ప2 చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో సాయం చేస్తున్నాడట బుచ్చిబాబు.
మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్‌తో సినిమా చేస్తున్నాడు. అనంతరం జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది రామ్ చరణ్. అయితే, ఈ కథ చర్చల దశలోనే స్టాప్ అయ్యిందని టాక్ నడుస్తోంది. దీంతో రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో మూవీ తర్వాత ప్రాజెక్టు పరిస్థితి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ వేరే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కథలు వింటున్నాడట.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను కలిశాడట రామ్ చరణ్. తదుపరి ప్రాజెక్టు గురించి చర్చకు వచ్చిన క్రమంలో బుచ్చిబాబు తనకు చెప్పిన కథను రామ్ చరణ్ వద్ద ప్రస్తావించాడట ఎన్టీఆర్. ఈ కథ ప్రత్యేకంగా వింటే, నీకు నచ్చితే టేకోవర్ చేయవచ్చని సూచించాడట ఎన్టీఆర్. దీంతో బుచ్చిబాబును రామ్ చరణ్ పిలిపించుకొని కథ విన్నాడట. ఇక కథ బాగా కనెక్ట్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ కోసం త్యాగం చేశాడట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఎన్టీఆర్‌తోపాటు రామ్ చరణ్ కూడా ఈ మూవీలో నటించారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనూ వరుస హిట్లతో రాణించారు. నిన్ను చూడాలని సినిమాతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ రెండో మూవీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ టాలీవుడ్‌లో దుమ్ము దులిపేసింది. కుర్రకారులో హుషారు తెప్పించింది. ముఖ్యంగా కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొట్టాడు. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపించేవి.
Read Also : Devara: ఎన్టీఆర్ 30వ సినిమా దేవర.. ఫస్ట్ లుక్ విడుదల