Anasuya Bharadwaj: బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తాజాగా థాయ్‌లాండ్‌లో షికారుకెళ్లింది. ఇటీవల వరుసగా సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న అనసూయ.. మొన్నామధ్యనే జబర్దస్త్ మానేసింది. అందుకు వివిధ కారణాలున్నప్పటికీ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయింది అనసూయ. ఈ క్రమంలో కాస్త గ్లామర్ షోను కూడా పెంచేసింది. తాజాగా ఆమె భర్తతో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో షికారు చేసింది. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంది.
ఇందులో భాగంగా భర్తతో తీసుకున్న ఫొటోలను (Anasuya Hot Photos) సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అందాల ప్రదర్శనతో అనసూయ ఫొటోలను విడుదల చేయడంతో అవి కాస్తా క్షణాల్లోనూ వైరల్‌గా మారిపోయాయి. నెటిజన్లు విపరీతంగా లైక్, షేర్, కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫొటోలలో అనసూయ గ్లామర్ డోస్ పెంచింది. బికినీలో కనిపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. దాంతోపాటు తన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ స్పెషల్ స్టోరీని కూడా పోస్టుకు జత చేసింది ఈ అమ్మడు.
ప్రస్తుతం అనసూయ పుష్ప 2 (Pushpa 2) సినిమా చేస్తోంది. దాంతోపాటు విమానం(Vimanam) అనే మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. అనసూయ అంటేనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన, సంబంధం లేని విషయాల్లోనూ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. దీంతో చాలా మంది అనసూయకు అభిమానులుగా మారారు. గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ అనసూయ ఎప్పటికప్పుడు నెటిజన్లను, అభిమానులను అలరిస్తూ వస్తోంది. ఈరోజు అనసూయ, భరద్వాజ్ పెళ్లి రోజు కూడా కావడంతో సెలబ్రేషన్స్ అంబరాన్నంటేలా చేసుకున్నారు.
భర్త భరద్వాజ్‌తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో పెళ్లిరోజు సంబరాలు జరుపుకుంది అనసూయ. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అనసూయ బికినీలో ఉండటంతో పాటు ఒడ్డున హస్బెండ్‌తో కలిసి రొమాన్స్‌చేసినంత పని చేసింది. భర్తకు లిప్ లాక్ ఇస్తూ మ్యారేజ్ డే విషెస్ చెప్పింది. భర్తపై తనకున్న అనురాగం, ఆప్యాయతలను తెలియజేస్తూ ఓ పోస్టును రాసింది. అనసూయ కెరీర్‌లో ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అనసూయ. సినిమా ఆఫర్లు పెరగడంతో జబర్దస్త్ లాంటి షోలకు గ్యాప్ ఇచ్చింది. యాంకరింగ్‌కు కూడా తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. తాజాగా రంమార్తాండ మూవీలో నటించింది.
తొలినాళ్లలో న్యూస్ యాంకర్‌గా జర్నీ మొదలు పెట్టిన అనసూయ.. తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ ఆమెకు పేరు ప్రఖ్యాతలు, సంపదలు, ఆస్తులు తెచ్చి పెట్టింది. దీంతో చాలా మెట్లు ఎక్కేసింది అనసూయ. అటు తర్వాత సినిమాల్లోనూ అడపాదడపా అవకాశాలు రావడం, ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించే చాన్స్‌లు కొట్టేసింది అనసూయ. దీంతో మొన్నీమధ్యనే జబర్దస్త్‌తోపాటు యాంకరింగ్ కూడా వదులుకొని సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. యాంకరింగ్, బయటి కార్యక్రమాలు, వగైరా అన్నీ కలుపుకొని కోట్లాది రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టింది అనసూయ.
Read Also : Anasuya: ది దేవరకొండపై అనసూయ ట్వీట్లు..! ఫ్యాన్స్ రచ్చో రచ్చ!