విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ. ఇందులో సమంత (Samantha) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ను హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో హీరో పేరు ”ది దేవరకొండ” అని ఉంది. ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులు చాలా మంది ఖుషీ అయిపోతున్నారు. అయితే, యాంకర్ నుంచి సినీ నటిగా మారిన అనసూయ (Anasuya) దీనిపై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ (Anasuya) తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అనేక విమర్శలు చేస్తూ అభిమానులు, నెటిజన్ల నుంచి కౌంటర్లు ఎదుర్కొంటూ ఉంటుంది అనసూయ.
ఈ క్రమంలోనే తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతేనా…. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు ఫ్రీ పబ్లిసిటీ, అనసూయకు ఉచితంగా అటెన్షన్… రెండూ ఏకకాలంలో వరదలా వచ్చేలా చేసింది. ఖుషీ పోస్టర్‌పై స్పందించిన అనసూయ..‘‘ఇప్పుడే ఒకటి చూశాను. ‘ది’ (the) అనే పదం పెట్టుకుంటారా? బాబోయ్!! పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేసిందని గుర్తించారు. నిమిషాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది.
అనంతరం స్పందించిన విజయ్ దేవరకొండ అభిమానులు, నెటిజన్లు అనసూయను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అయితే అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా వరుస ట్వీట్లు చేస్తుండటం విశేషం. తెలుగు యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండపై ఈ తరహా ట్వీట్లు అనసూయకు తగదని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లపై స్పందించిన అనసూయ..ఆ హీరో అభిమానులను ఉద్దేశిస్తూ ఆమె మరో ట్వీట్ చేసింది. ‘‘భలే రియాక్ట్ అవుతున్నారుగా. బంగారుకొండలంట.. ఎక్కడో అక్కడ నేను చెప్పింది నిజం అనేది నిరూపిస్తూనే ఉన్నందుకు థ్యాంక్యూ’’ అని ట్వీట్ చేసింది అనసూయ.
అనసూయ చేసిన వరుస ట్వీట్లపై అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. విజయ్ దేవరకొండ విషయంలో అనసూయకు ఎందుకింత కడుపుమంట? ది అని పెట్టుకుంటాడు.. అవసరమైతే రౌడీ బాయ్ అని పెట్టుకుంటాడు.. అనసూయకు ఎందుకింత అసూయ అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో అనసూయపై మండిపడుతున్నారు.
కౌంటర్ ఇవ్వడంలో భాగంగా అనసూయ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించింది. ”చాలా మందిని నిద్రలేపటానికి ఇదే సరైన మార్గం. నా అభిమాన ఫ్యాన్ పేజీల అడ్మిన్‌ల గురించి నాకు తెలియదు. ఇతరుల్లా కాకుండా నా ప్రభావం చాలా మందిపై ఉన్నందుకు గర్వంగా ఉంది. అయితే, అందరితోనూ దీనికి పోలిక లేదు. ఇదొక ఆప్షన్ అని మాత్రమే చెబుతున్నా. అభిమానులు చేస్తున్న ఈ రచ్చను ఆపేందుకు ఏ స్టార్ హీరో ఎందుకు వకల్తా తీసుకోరో తెలియడం లేదు. గొప్ప బాధ్యత నుంచే గొప్ప శక్తి వస్తుంది. నేను బాధ్యతగా ఉండబట్టే, నా వంతు ప్రభావాన్ని చూపిస్తున్నా. ఎప్పుడూ ఇతరులను విమర్శించే ఫ్యాన్స్ లేకుండా ఉంటేనే మంచిది కదా” అని అనసూయ (Anasuya bharadwaj) ట్వీట్ చేయడం గమనార్హం.
మొత్తంగా అనసూయ అట్రాక్షన్ కోసం, సినిమాల్లో అవకాశాలు పెంచుకోవడానికే ఇలా చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లు కూడా అవుతోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Nandamuri Balakrishna: బాలయ్య కెరీర్‌లో డిజాస్టర్లు ఎన్ని?