Vijay Deverakonda Kushi: ఖుషి సెకండ్ సింగిల్ కమింగ్ సూన్.. సెప్టెంబర్‌ 1న మూవీ గ్రాండ్‌ రిలీజ్‌!

Vijay Deverakonda Kushi: విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. సమంత ఇందులో ముస్లిం యువతిగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. తాజాగా రెండో సింగిల్‌ త్వరలోనే విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ అనౌన్స్‌ చేసింది. ఫస్ట్‌ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చిందని, ఏకంఆ 70 ప్లస్‌ మిలియన్‌ వ్యూస్‌ వచ్చినందుకు సంతోషంగా ఉందని మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఖుషి సినిమాను సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. (Vijay Deverakonda Kushi)

విజయ్‌ దేవరకొండకు (Vijay Deverakonda) యూత్‌ ఫాలోయింగ్‌ భారీగా ఉంది. గత చిత్రం లైగర్‌ (Liger) బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో అటు పూరీ జగన్నాథ్‌కు (Puri Jagannath) , ఇటు విజయ్‌ దేవరకొండకు హిట్‌ కొట్టడం ఇప్పుడు అత్యవసరం. అందులో భాగంగానే వీళ్లిద్దరూ కలిసి చేయాల్సిన తదుపరి ప్రాజెక్టును రద్దు చేసుకున్నారు. విజయ్‌ దేవరకొండ ఖుషి (Kushi) మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. గీత గోవిందం (Geetha Govindam) టైప్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టేందుకు ఈ చిత్రం ఉపయోగపడుతుందని విజయ్‌ దేవరకొండ ఆశిస్తున్నాడు. అనుకున్నట్లే యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. మ్యూజిక్‌, పాటలు ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్నాయి.

నా రోజా నువ్వే.. అనే సాంగ్‌ (Naa Roja Nuvve Song) దాదాపు అందరి సెల్‌ఫోన్‌ రింగ్‌టోన్స్‌గా పెట్టుకున్నారు. షార్ట్స్‌, యూట్యూబ్, ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టా రీల్స్‌లో ట్రిండింగ్‌లో ఉంది ఈ పాట. “ఖుషి ఫస్ట్‌ సింగిల్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. సుమారు 70 మిలియన్ల మందికిపైగా ఆదరించారు. ఈసారి ఇంకా ఎక్కువ ఆకట్టుకొనేలా రెండో సింగిల్‌ రిలీజ్‌ చేస్తాం. ఆన్‌ ది వేలో ఉంది. రెండో సింగిల్‌ అనౌన్స్‌మెంట్‌ సూన్‌.” అంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికా ప్రకటించింది. సెప్టెంబర్‌ ఒకటిన థియేటర్లలో కలుద్దామంటూ పేర్కొంది.

ఖుషి సినిమాలో ముఖ్యంగా రొమాంటిక్‌ కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ కథ రాశారు. రచనతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే తీసుకున్నారు. ఖుషి మూవీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, సమంత కథానాయిక. కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన లవ్‌ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని పాన్‌ ఇండియా రేంజ్‌లో దక్షిణాది భాసలతో పాటు హిందీలోనూ రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మురళి జి. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వై.రవి శంకర్‌, నవీన్‌ ఎర్నేని ప్రొడ్యూసర్లు.

సీనియర్‌ నటుడు జయరామ్‌, హాస్య నటుడు వెన్నెల కిషోర్‌తో (Vennela Kishore) పాటు మరో కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna), సీనియర్‌ యాక్టర్‌ సచిన్‌ ఖేడెకర్‌, సీనియర్‌ నటి రోషిణి.. ఇతర ముఖ్య పాత్రల్లో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. రొమాన్స్‌, డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. లైగర్‌తో దెబ్బతిన్న విజయ్‌ దేవరకొండ.. ఖుషితో హిట్‌ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్‌! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles