మంగళవారం, 20 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Gold rates today 28-03-2024: ఇవాళ్టి బంగారం ధరలు ఇవీ..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 28 మార్చి 2024

Gold rates today 28-03-2024: బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.67,000కు చేరుకుని రికార్డు సృష్టించింది. మరోవైపు వెండి కూడా కిలో రూ.80,000 దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎగబాకుతున్నాయి. గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇవీ..

తెలంగాణలోని హైదరాబాద్‌ గోల్డ్‌ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,360గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.66,940 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.80,100 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.61,360 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.66,940 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.80,100 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.62,160 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,810 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ప్రైస్ రూ.61,360గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.66,940 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.61,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.67,090 గా నమోదైంది. జైపూర్‌, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.

మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.40 తగ్గింది. రూ.24,060 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.

ఇవీ చదవండి: JVD at Bhimavaram: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశాం : సీఎం జగన్‌
Mobile Phone: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు సగటున రోజుకు 80 సార్లు చెక్‌ చేస్తున్నారట!!
Realme 12+ 5G: ఇండియా మార్కెట్‌లోకి రియల్‌ మీ 12 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading