గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Gold Price Today (28-06-2023): రూ.100 తగ్గిన పసిడి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 28 జూన్ 2023

Gold Price Today (28-06-2023): బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ కదలిక లేని స్థితిలో కొనసాగుతోంది. అమెరికా ఫెడ్‌ చైర్ జెరోమ్‌పావెల్‌ స్పీచ్‌, ఎకనమిక్‌ డేటా కోసం పెట్టుబడిదారులు వేచి చూడటం లాంటి పరిణామాలతో పసిడి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,924 డాలర్ల వద్ద నమోదైంది. ఇండియాలో ఆర్నమెంట్‌ బంగారం ధరలో మార్పు లేనప్పటికీ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర మాత్రం రూ.100 తగ్గింది. మరోవైపు కేజీ వెండి ధర చూస్తే రూ.600 పెరిగింది. Gold Price Today (28-06-2023)

తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..

తెలంగాణలోని హైదరాబాద్‌ గోల్డ్‌ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,350గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,180 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.75,700 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర రూ.54,350 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.59,180 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.75,700 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.54,750 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,730 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.

దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ప్రైస్ రూ.54,350గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.59,180 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.54,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,430 గా నమోదైంది. జైపూర్‌, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.

మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ.70 పెరిగింది. రూ.24,530 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.

సాధారణంగా బంగారం, సిల్వర్‌ సహా ప్లాటినం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలంకరణ లోహాల్లో ప్రతి రోజూ ఈ మార్పులు సహజం. ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో రేట్లు పెరగడం, లేదా తగ్గడం లాంటి పరిణామాలతో మనదేశంలోనూ మార్పులు జరుగుతాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల ధరలు పుంజుకొనేందుకు, తగ్గుదల నమోదు చేసేందుకు పలు కారణాలు ఉంటాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ వార్‌.. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ నేపథ్యంలో కొన్ని నెలలుగా అన్ని రకాల ధరలూ అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం స్టాక్, వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు.. ఇలా అనేక అంశాలు గోల్డ్‌ ప్రైస్‌ను నిర్దేశిస్తుంటాయి.

Read Also : Tomato price: అయితే డకౌట్‌.. లేదంటే సెంచరీ.. టమాటా ధర పరిస్థితి ఇదీ..!

ట్యాగ్స్: , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading