HomeNationalHaryana J&K Results: హర్యానాలో బీజేపీ సత్తా.. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ హవా!

Haryana J&K Results: హర్యానాలో బీజేపీ సత్తా.. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ హవా!

Haryana J&K Results: నాటకీయ పరిణామాల నడుమ, కౌంటింగ్ ప్రారంభ కొన్ని రౌండ్ల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ను బీజేపీ అధిగమించింది. హర్యానాలో బీజేపీ దూసుకెళ్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో (J&K) కాంగ్రెస్‌ హవా చాటుతోంది. (Haryana J&K Results) మధ్యాహ్నం 1 గంటకు అంటే ఐదు గంటల కౌంటింగ్‌లో హర్యానాలోని 90 స్థానాలకు గాను బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

కౌంటింగ్ ట్రెండ్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయి. కానీ, తర్వాత ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారిపోయాయి. బిజెపి నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో భేటీ ఏర్పాటు చేసింది. మరోవైపు కౌంటింగ్‌ ఆలస్యంగా సాగడంపై కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయం, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో డిఫరెంట్ తీర్పును ప్రతిబింబించాయి.

హర్యానాలో, అధికార వ్యతిరేకత మరియు జాట్‌లు, రైతు సంఘం అసంతృప్తి కారణంగా బిజెపికి ప్రతికూలంగా కనిపించింది. అయితే జాట్‌ల ఓట్లపై కాంగ్రెస్ దృష్టి, జాట్‌యేతర ఓట్ల కౌంటర్ కన్సాలిడేషన్‌కు దారితీసింది. బీజేపీ పునరాగమనానికి మరో కీలక అంశం.. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు అని విశ్లేషణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రచారంలో ఫ్రీ హ్యాండ్ పొందిన ప్రముఖ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా వంటి ఇతర ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీసినట్లు చెబుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో, నేషనల్ కాన్ఫరెన్స్ ఒక పునరాగమనాన్ని ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు సొంతంగా మెజారిటీ వైపు దూసుకుపోతోంది. అబ్దుల్లా నేతృత్వంలోని పార్టీ దాదాపుగా తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దం తర్వాత ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ భాగం రాష్ట్రపతి పాలనలో ఉంది. రాజ్యాంగం కింద మంజూరు చేసిన ప్రత్యేక హోదాను రద్దు చేసి, 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి: Instagram: ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. కారణం ఏంటంటే..
Gymnast Dipa: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం..
IPL 2025: ఐపీఎల్ వేలం.. ఈ ఆటగాళ్ల గిరాకీ పెరిగిందా?
Rajinikanth: రజనీకాంత్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. కథ మార్చేశారా?
Telangana CM: సీఎస్ఎంపీ, మూసీ, సీనరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సహకరించండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు