జీవితం సుఖమయంగా గడవాలంటే అందరికీ డబ్బు అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు విపరీతంగా వచ్చి చేరుతుందని పెద్దలు చెబుతారు.అన్నింటినీ డబ్బుతో కొనలేక పోయినా, చాలా వరకు డబ్బుతో జీవితం ముడిపడి ఉంటుందనేది వాస్తవం. డబ్బు లేనిదే నిత్య జీవితం సాఫీగా గడవడం కష్టం. మరి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా పూజించాలా? అనే ప్రశ్నలకు అనేక సమాధానాలు ఉన్నాయి. లక్ష్మీదేవి కరుణ పొందాలంటే అనేక మార్గాలు మన పూర్వీకులు సూచించారు. వీటిలో ఒకటి తారమ మాల (Benefits of Thamara Mala). కమలాగట్ట మాల, లక్ష్మీదేవి అనుగ్రహ మాల (Benefits of Thamara Mala) అని కూడా పిలుస్తారు.
1. వీటిని కలువలు అని కూడా అంటారు. లక్ష్మీదేవి తామర మాలకు పుత్రజీవి అని పేరుంది.
2. తామర మాలను సంతానం లేని వారు నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ఉదయాన్నే తింటే మంచి ఫలితాలు పొందవచ్చు.
3. చూర్ణం చేసుకొని కాస్త వేడి చేసిన ఆవు పాలతో కలిపి తాగాలి. ఇలా కొంత కాలం పాటు చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెబుతున్నారు.
4. తామర మాల ధరించిన వారిలో మనో నిగ్రహం, ఏకాగ్రత, సాత్విక గుణాలు అలవాటవుతాయి.
5. తామర మాల ధరించడం వల్ల శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
6. స్పటిక మాల, పగడాల మాల కంటే మంచి ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్న శాస్త్రంలో చెప్పారు.
7. మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది శ్రద్ధా భక్తులతో లక్ష్మీదేవిని పూజించాలి.
8. తమ చేతిలో ధనం అసలు నిలబడటం లేదని భావించే వారు తామర మాలతో జపం చేసినా, ధరించినా ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
Health Tips: ఉప్పునీటితో పుక్కిలించండి.. పళ్ల ఆరోగ్యంపై చిట్కాలు..
దంత సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమయాల్లో డెంటిస్టులను సంప్రదించడం ఇష్టంలేని చాలా మంది అనేక పద్ధతులు ట్రై చేస్తుంటారు. దంత వైద్యుల వద్దకు వెళ్తే ఉన్న పళ్లు పీకేస్తారనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. ఈ నేపథ్యంలో పళ్ల ఆరోగ్యం కోసం ఇంట్లో లభించే కొన్నింటితో చిట్కాలు పాటిస్తే సరి. కొన్ని టిప్స్ మీకోసం..
1. సీజన్ మారినప్పుడల్లా కొన్ని సమస్యలు వస్తుంటాయి. శీతాకాలం కారణంగా గొంతు, నోటికి సంబంధించిన పలు సమస్యలు అటాక్ చేస్తాయి.
2. ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా వరకు ఆరోగ్య చిట్కాలు పాటించవచ్చు.
3. వంటింట్లో ఉండే ఉప్పును వాడితే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.
4. ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
5. గొంతు సమస్యలున్నా, శ్వాసకోశ సమస్యలున్నా తక్షణం రిలీఫ్ లభిస్తుంది.
6. బ్రష్ చేశాక ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
7. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు అధిగమించడంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
8. గొంతులో బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుకోవచ్చు.
9. బాడీలో యాసిడ్స్ లెవల్స్‌ను స్థిరీకరిస్తుంది. నోట్లో దుర్వాసన సమస్య కూడా పోతుంది.
10. ముక్కుదిబ్బడ సమస్యకు మంచి పరిష్కారం ఉప్పునీటిని పుకిలించడం.
11. తరచూ నాలుక, నోట్లో పగుళ్లు, వాపులు లాంటి సమస్యలున్న వారు కూడా ఇలా ట్రై చేసి చూస్తే మంచి ఫలితాలొస్తాయి.
12. చిగుళ్ల వాపు, రక్తం కారడం, పంటినొప్పి లాంటి సమస్యలున్న వారు ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు.
13. రోజుకోసారి ఇలా చేయడం వల్ల నోరు పరిశుభ్రంగా తయారవుతుంది.
14. గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపు సమస్య కూడా తగ్గుతుంది. చక్కటి ఆహారం, ద్రవాలను తీసుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.
Read Also : Astrology: కుజ బంధనం నుంచి విముక్తి.. ఇక అన్నీ శుభ ఫలితాలే! మీ రాశి ఉందా?