HomeAstrologyAstrology: కుజ బంధనం నుంచి విముక్తి.. ఇక అన్నీ శుభ ఫలితాలే! మీ రాశి ఉందా?

Astrology: కుజ బంధనం నుంచి విముక్తి.. ఇక అన్నీ శుభ ఫలితాలే! మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రంలో (Astrology) కుజ బంధనం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. మార్చి 11వ తేదీ నుంచి కుజ స్తంభన తొలగిపోయింది. కొన్ని రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి కొంత అననుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర (Astrology) పండితులు చెబుతున్నారు. అయితే, శుభ ఫలితాలు వచ్చే వారు పరిహారాలు పాటించకపోయినా ఫర్వాలేదని, వ్యతిరేక ఫలితాలు గోచరించే వారు పరిహారాలు (Astrology) పాటిస్తే వాటి ప్రభావం కాస్త తగ్గుతుందని చెబుతున్నారు.

ఆస్ట్రాలజీలో కుజ గ్రహానికి ప్రత్యేకత ఉంటుంది. కుజ గ్రహ సంచారంతో ద్వాదశ రాశుల వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతుంటారు జ్యోతిష్యులు. కుజ గ్రహ సంచారం సక్రమంగా లేకపోతే కొన్ని రాశుల వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. మార్చి నెల 11వ తారీఖున కుజ స్తంభన తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజ గ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోని ప్రవేశం చేస్తుంది. అక్టోబరు నుంచి కుజ గ్రహం వృషభరాశిలోనే స్తంభించి పోయి మేష, వృషభ, వృశ్చిక, కుంభ రాశుల వారి జీవితాల్లో ఇక్కట్లను తెచ్చి పెట్టింది.

ఈ నేపథ్యంలోనే ఆయా రాశుల వారికి గత ఆరు నెలలుగా అనేక సమస్యల సుడిగుండంలో గడిపారు. మొదలు పెట్టిన ఏ పనీ పూర్తి కాకుండా అనేక వ్యవహారాలు పెడింగ్‌లో పడిపోయాయి. ఈ రాశుల వారికి పనులన్నీ వేగవంతంగా పూర్తి అయిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొంత కాలంగా ఉన్న ఆటంకాలన్నింటికీ ఫుల్‌ స్టాప్‌ పడిపోతుందని భరోసా ఇస్తున్నారు జ్యోతిష్య నిపుణులు.

మేష రాశి వారికి కుజుడు స్వయంగా అధిపతి. ఈ రాశికి రెండో రాశి అయిన వృషభంలో కుజుడు స్తంభించడం వల్ల ఆదాయానికి, కుటుంబానికి, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహాలన్నీ ముందుకు సాగక ఇక్కట్లు పడ్డారు. దీంతో మేష రాశి వ్యక్తులకు తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నిరాశక్తత ఏర్పడ్డాయి. ఈ రాశి వారికి తప్పకుండా అన్నీ సర్దుకుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పనులన్నీ పూర్తవుతాయని, ముఖ్యమైన సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని చెబుతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి వార్త అందుతుందని సూచిస్తున్నారు.

ఇక రెండో రాశి వృషభ రాశి విషయానికి వస్తే.. ఈ రాశిలో కుజుడు స్తంభించడం వల్ల వీరికి అన్ని రంగాల్లో పురోగతి ఆగిపోయింది. వీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందకపోవడం, పెళ్లి ప్రయత్నాలు ఆగిపోవడం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఇక్కట్లు, రెగ్యులర్‌ లైఫ్‌లో ఒత్తిళ్లు.. ఇలాంటివి కలగడానికి కుజ స్తంభన ప్రధాన కారణమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, కుజ స్తంభన తొలగిపోవడం వల్ల మార్చి 11వ తేదీ తర్వాత ఈ పరిస్థితిలో మార్పు తథ్యమంటున్నారు. పరిస్థితుల్లో క్రమంగా మార్పు రావడం, అతి వేగంగా పురోగతి చెందడం మొదలవుతుందంటున్నారు. అతి ముఖ్యమైన పనులు ఈజీగా జరిగిపోవడం, వివాహ యత్నాలు ఫలప్రదం కావడం జరుగుతాయని చెబుతున్నారు.

మరోవైపు వృశ్చిక రాశి వారికి కూడా కుజ గ్రహమే అధిపతి. వీరికి ఆరు మాసాలుగా ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు తీవ్రంగా బాధించి ఉంటాయి. అయితే, కుజుడు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ క్షణం నుంచే ఈ రాశి వారికి చాలా విషయాల్లో ఊహించిన దాని కంటే ఎక్కువే ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు అన్నీ తొలగిపోయి పరిష్కారం అవుతాయంటున్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వెతుక్కుంటూ రావడం, గతంలో వీరిపై పడిన నిందలు తొలగిపోవడం, దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి సుంఖసంతోషాలు వెల్లివిరుస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఇక కుంభ రాశి వారికి విషయానికి వస్తే.. ఈ రాశి వారికి నాలుగో స్థానం అంటే.. సుఖం, గృహం, వాహన స్థానాల్లో కుజ గ్రహం స్తంభించిపోయింది. దీంతో వీరికి గత ఆరు నెలలుగా సుఖం తగ్గిపోయింది. మనశ్శాంతి కరువై అనుకోని సమస్యలు ఏర్పడి ఉంటాయి. కుటుంబ సమస్యలతో సతమతం అయి ఉంటారు. వాహనాలపై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలకు గురి కావడం, కింద పడిపోవడం, బంధువులు, మిత్రులతో సఖ్యత లేమి.. లాంటి సమస్యలు వెంటాడి ఉంటాయి. అయితే, కుజ స్తంభన ముగిసిపోవడం వల్ల రెండు మూడు రోజుల తర్వాత నుంచే వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తాయని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు. క్రమ క్రమంగా అన్ని సమస్యలూ తగ్గుముఖం పట్టి ఆందోళన వీడుతుందని చెబుతున్నారు.

పరిహారాలు ఏమేం చేసుకోవాలంటే..

ఆయా రాశుల వారికే కాకుండా ఇతర రాశుల వారు కూడా కుజ గ్రహం మిథునంలోకి ప్రవేశించడం వల్ల ఒకటి రెండు పరిహారాలు చేసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజగ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇంట్లో గానీ, ఆలయానికి వెళ్లిగానీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చన, పూజ లాంటివి చేయించుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కుజ గ్రహం సానుకూలంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉదయమే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, స్వామికి నిత్య దీపారాధన వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

Read Also : Copper Water: కాపర్ పాత్రలో నీరు తాగితే ప్రయోజనాలు ఇవే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు