బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Collectors Conference AP : నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 15 సెప్టెంబర్ 2025

Collectors Conference AP : ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4వ కలెక్టర్ల కాన్ఫరెన్సు జరుగనుంది. సచివాలయం ఐదో బ్లాక్ లో ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు ప్రారంభం కానుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.

ఆ మేరకు అధికారులు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ప్రజెంటేషన్లు రూపొందించారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 15 తేదీన జీఎస్డీపీపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్ తదితర శాఖల పురోగతి ఆయా జిల్లాల్లో ఎలా ఉందన్న అంశాన్ని కలెక్టర్ల నుంచి తెలుసుకోనున్నారు.

రెండో అంశంగా సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాలు, అన్నా క్యాంటీన్లు, పీ4 తదితర అంశాల అమలు ఎలా ఉందన్న దానిపై సమీక్ష జరుగనుంది. మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధనం తదితర అంశాల పురోగతిపై వివరాలను తెలుసుకోనున్నారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ తో పాటు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న దానిపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

ఇక రెండో రోజు 16 తేదీన ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రజెంటేషన్ తో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సప్ లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలను చర్చించనున్నారు.

ఏడో కేటగిరీలో ఆదాయార్జన శాఖలైన రెవెన్యూ, భూములు, స్టాంపులు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, అటవీ, ట్రాన్స్ పోర్టు, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకోనున్నారు. ఇక 8 వ అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపైనా చర్చించనున్నారు.

ఇవీ చదవండి: Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
YS Jagan PC : మహిళలకు రూ.1,500, నిరుద్యోగభృతి ఏదీ? సూపర్ సిక్స్ ఎలా హిట్? : జగన్

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading