ఏ చిన్న జబ్బు వచ్చినా యాంటీ బయాటిక్స్ (Antibiotics) అధికంగా వాడుతున్నారు జనం. చిన్న దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా యాంటీ బయాటిక్ (Antibiotics) మాత్రలు తెచ్చి వేసేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ (Antibiotics) అధిక మొత్తంలో వినియోగిస్తే భవిష్యత్తులో ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.
1. ఓ సర్వే ప్రకారం యాంటీబయాటిక్స్ వాడకంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది.
2. దీన్ని బట్టి ప్రజలు ఏ విధంగా యాంటీ బయాటిక్స్ వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ఆందోళనకర అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ప్రతి చిన్న దానికీ యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
3. యాంటీ బయాటిక్స్ అధిక మోతాదులో వాడిన రాష్ట్రాల జాబితాను ఇటీవల విడుదల చేశారు.
4. బోస్టన్ యూనివర్సిటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పరిశోధకులు దేశ వ్యాప్తంగా సుమారు 9 వేల మంది నుంచి వివరాలు సేకరించి నివేదిక తయారు చేశారు.
5. ఇందులో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తేలింది. తొలి రెండు స్థానాల్లో ఢిల్లీ, పంజాబ్ ఉండటం గమనార్హం.
6. తెలంగాణ వ్యాప్తంగా జనం సాధారణ జ్వరానికి కూడా ఎక్కువ డోస్ ఉన్న మందులు వాడటానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేయడానికి పూనుకుంటున్నారు.
7. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లడం తమకు నచ్చిన మాత్రలు తీసుకోవడం చేస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అధికంగా వాడితే అనర్థాలు అనేకం ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు.
8. మోతాదుకు మించి యాంటీ బయాటిక్స్ వినయోగంతో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. భవిష్యత్ రోజుల్లో మరిన్ని సమస్యలు వస్తాయి.
vastu tips for sleep: నిద్రకు పీడకలలు అడ్డు వస్తున్నాయా? ప్రశాంత నిద్రకు ఏం చేయాలి?
రోజంతా కష్టపడి రాత్రి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నిద్రలేమి సమస్య చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. సరిగా నిద్ర పట్టక అనారోగ్యం బారిన పడుతుంటారు. రాత్రి అయ్యిందంటే చాలా మందికి ఇదే భయం. విపరీతమైన ఆలోచనలు, ఆందోళనతో నిద్ర పట్టక సతమతమవుతుంటారు. ఒకవేళ నిద్ర పట్టినా గంటా రెండు గంటల్లోనే మళ్లీ మెలకువ రావడం జరుగుతూ ఉంటాయి. తర్వా తనిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.
1. ఇలాంటి నేపథ్యం ఉన్న వారి కోసం వాస్తు శాస్త్రంలో పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. రాత్రి వేళలల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చని చెబుతున్నారు.
2. నిద్రపోయే ముందు బెడ్ రూమ్ లో ఏ దిశలో తల పెట్టుకొని పడుకుంటామనేది పరిశీలించుకోవాలి. పొరపాటున కూడా ఉత్తర దిశకు తల పెట్టి నిద్రించకూడదని నిపుణులు చెబుతున్నారు.
3. రాత్రి పూట పీడకలలు వేధిస్తుంటే నాలుగు మూలల్లో కాస్త రాళ్ల ఉప్పును పోయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందట.
4. ప్రశాంత నిద్రకు మార్గం సులువవుతుందని చెబుతున్నారు. ఓ చెంబులో నీళ్లు తీసుకొని మంచం పక్కన ఓ మూలకు పెట్టి తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలి.
5. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందట. ప్రతికూల ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పడుతుంది.
6. పీడ కలలతో బాధపడుతున్న వారు వాస్తు నియమాలతో పాటు నిద్రకు ఉపక్రమించే ముందు భగవంతుని ధ్యానించాలని సూచిస్తున్నారు.
7. రాత్రిపూట ఆందోళన కలిగించే సినిమాలు, వెబ్ సిరీస్ లు, హార్రర్ మూవీలు, సీరియల్స్ చూడటం మానేయాలి. నిద్రపోయే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవడం ద్వారా ప్రశాంత నిద్ర వస్తుందట.
8. అలాగే దిండు కింద ఇనుప వస్తువు కూడా పెట్టుకోవచ్చు. మహిళలైతే జుట్టును విరబోసుకోకుండా జడతోనే నిద్రించడం మంచిది.
Read Also : White Sugar: వైట్ షుగర్‌తో ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..