White Sugar: వైట్ షుగర్‌తో ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మనందరం రోజూ ఏదో ఒక రూపంలో ప్రాసెస్ చేసిన ఫుడ్ ను తీసుకుంటూ ఉంటాం. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేస్తుంది. దాంతో పాటు శరీరంలో కొవ్వును విపరీతంగా పెంచుతాయి. వీటిలో ప్రాసెస్ చేసిన వైట్ షుగర్ (White Sugar) కూడా చాలా ప్రమాదకరమైనదని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని (White Sugar) తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

1. చక్కెర వినియోగంతో శరీరానికి చేటు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు.

2. శరీరంలోని చక్కెర (White Sugar) కొరత తీర్చడానికి బెల్లం ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

3. శరీరం శక్తిని పొందడానికి బాడీకి గ్లూకోజ్ అవసరం. అయితే, గ్లూకోజ్ పొందడానికి చక్కెరను ప్రాసెస్ చేయడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

4. శరీరానికి అవసరైన గ్లూకోజ్ ను బెల్లం ద్వారా పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్ అనేది చాలా ముఖ్యమైనది.

5. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇన్సులిన్ లోపం మనిషిని దారుణంగా దెబ్బ తీస్తుంది. అనేక జబ్బులు రావడానికి వీలు కల్పిస్తుంది.

6. చక్కెర తీసుకోవడం అందరూ తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.

7. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. ప్రాసెస్ షుగర్.. టైప్ 2 డయాబెటిస్ కూ కారణం అవుతుందంటున్నారు.

8. దీంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

9. మరి రోజూ టీ, కాఫీలు తీసుకొనే వారు చక్కెర వాడకుండా ఉండలేరు కదా.. అందుకే పురుషులు, మహిళలు స్వల్ప స్థాయిలో మాత్రమే షుగర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

10. మహిళలు రోజుకు 6 స్పూన్లు, పురుషులు రోజుకు 9 స్పూన్లు మాత్రమే తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతకు మించితే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

Blood Sugar: డయాబెటిక్ తో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఇలా చేయండి..

డయాబెటిక్ పేషెంట్ల కోసం ఇంట్లోనే దొరికే సహజ వస్తువులతో రెమెడీ చేసుకోవచ్చు. మధుమేహం శరీరంలోని లోపలి భాగాల్ని బలహీన పరుస్తుంది. మధుమేహం సోకితే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెడితేనే జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

1. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. సహజమైన ఇన్సులిన్‌గా పనిచేసి, మధుమేహ బాధితుల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కొన్నిఆకుకూరలు ఉపయోగపడతాయి.

2. వాటిలో ముఖ్యమైనది అశ్వగంధ. అశ్వగంధ ఆకులతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఈ ఆకులను ఎండలో ఉంచి, తర్వాత పొడిగా తయారు చేసుకోవాలి.

3. ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే డయాబెటిక్ పేషెంట్లకు మంచి ఉపశమనం దొరుకుతుంది.

4. మధుమేహ వ్యాధి గ్రస్తులకు మరో వరం లాంటిది కరివేపాకు. మనం నిత్యం వంటల్లో విపరీతంగా వాడుతూ ఉంటాం.

5. పచ్చి ఆకులను మదుమేహ రోగులు వాడొచ్చు. కరివేపాకులో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది.

6. అందుకే రోజూ ఉదయం కరివేపాకు రెమ్మలు నమిలితే డయాబెటిక్ రోగులకు మంచి ఫలితాలు వస్తాయి.

7. డయాబెటిక్ పేషెంట్లు మెంతి ఆకును వాడితే ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మెంతి ఆకులు లేదా మెంతులు తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది.

8. ఇంకా మామిడి ఆకులతో కూడా డయాబెటిక్ రోగులకు ఉపయోగాలు బోలెడు ఉన్నాయి. మామిడి ఆకుల్లో ఫైబర్, విటమిన్ సీ, పెక్టిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

9. మామిడి ఆకులు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం వడగట్టి తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

Read Also : Tulasi Vastu Tips: తులసి చెట్టును ఇంట్లో ఏ దిక్కులో పెట్టాలి?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles