Central Funds to Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) ఢిల్లీ వెళ్లేది ప్రతిసారీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనంటూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కానీ, ఆయన మాత్రం.. ఢిల్లీ వెళ్లేది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని నిరూపిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవలి కాలంలో ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధుల వరదే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చంద్రబాబు (Chandrababu) నాలుగేళ్లు ఎన్డీయేతో సఖ్యతగా మెలిగారు. పదవులు సైతం పంచుకున్న పరిస్థితి. అయితే, బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పటికీ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు తీసుకురాలేకపోయారనే వాదన ఉంది. (Central Funds to Andhra Pradesh)
వైఎస్ జగన్ (CM YS Jagan) ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీజేపీతో (BJP) కయ్యం పెట్టుకోలేదు. నాలుగేళ్లుగా సుహృద్భావ వాతావరణంలోనే రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. అయితే, బీజేపీతో నేరుగా పొత్తుగానీ, ఏ ఎన్నికల్లో కూడా సహకరించుకోవడంగానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చేయలేదు. కానీ… రాష్ట్ర ప్రయోజనాలు, నిధులు రాబట్టడంలో యువ ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ పరిపక్వత చూపించారు. అందుకు ఇటీవల రాష్ట్రానికి విడుదలైన నిధులే తార్కాణంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో సాధించలేనిది జగన్ చేసి చూపుతున్నారు.
ఏకంగా 30 నెలల్లోనే 40 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి వివిధ రూపాల్లో మంజూరు చేసింది. అంటే జగన్ మార్క్ చాణక్యం ప్రదర్శించినట్లేనని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై అటు తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్ర అసహనం, ఆవేదన, నిర్వేదం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి. అన్ని నిధులు ఇస్తే సీఎం జగన్ జనానికి పంచేస్తాడని, రాష్ట్రంపై మరింత అప్పుల భారం పెంచుతాడంటూ మధనపడిపోతున్నారు. చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు టీవీ డిబేట్లలో, పత్రికా ప్రకటనలు, విలేకరుల సమావేశాల్లో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులే ఇస్తున్నారని, కేంద్రం అదనంగా ఏమీ ఇవ్వడం లేదనేది వైఎస్సార్‌సీపీ నేతల వాదన. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఏపీ పర్యటనలో నేరుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఇటు వైఎస్సార్‌సీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఆవహించిందని, టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పడిపోయిందని మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.
రాష్ట్రానికి జగన్ తెచ్చిన, కేంద్రం ఇచ్చిన నిధుల వరద ఇదీ…
ఎన్నికల ఏడాదిలో జగన్ ప్రభుత్వానికి పెద్ద ఊరట ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద రూ.10,460 కోట్ల నిధులను మే 22వ తేదీన కేంద్రం రిలీజ్ చేసింది. అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి రూ.14,418 కోట్లు రీయింబర్స్ చేయడంతోపాటు రూ.12,911 కోట్లను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు జూన్ 16వ తేదీన రూ.28,704 కోట్ల ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తూ నిధులు విడుదల చేసింది కేంద్రం. దీంతో పాటు 8 వేల కోట్ల రుణాల చెల్లింపులోనూ వెసులుబాటు కల్పించింది. దశల వారీగా చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఏపీపై కాసుల వర్షం కురిపించడంతో అటు రాజకీయంగా వాతావరణం వేడెక్కింది.
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని, రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసమే కేంద్రం నిధులిస్తోందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఇందుకు వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులే కేంద్రం మంజూరు చేస్తోందని, అదనపు నిధులేమీ ఇవ్వడం లేదని చెబుతోంది. మధ్యలో టీడీపీ ఎంటర్ అయ్యి… ఒక పక్క జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మరోవైపు ఇన్ని వేల కోట్ల నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది.
Read Also : CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్ ఫైర్