మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

AP Fibernet: 39 రూపాయలకే కొత్త సినిమా “లవ్‌ యూ టూ” ఇంట్లోనే చూసేయండిలా..!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 16 జూన్ 2023

AP Fibernet: ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్‌నెట్‌ ద్వారా తక్కువ ధరకే ప్రజల వద్దకు సినిమా వచ్చేస్తోంది. నిర్మాతకు, ప్రేక్షకుడికి లాభం చేకూర్చేలా జీవో నంబర్ 13ను ఏపీ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా కొత్తగా వస్తున్న మూవీ “లవ్‌ యూ టూ”ను రూ.39కే చూసే చాన్స్‌ లభిస్తోంది. త్వరలో మూరుమూల ప్రాంతాలకు సైతం ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం, థియేటర్లకు పోటీ కాదని ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. (AP Fibernet)

వినూత్నమైన విధానంతో ప్రజానీకానికి అతి చేరువగా, నేరుగా థియేటర్లో మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే అవకాశం “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్” కల్పిస్తోంది. లవ్ యూ టూ చిత్ర బృందం విజయవాడలో పర్యటించింది. ఈ సందర్భంగా ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డితో కలిసి వారంతా మీడియాతో మాట్లాడారు. సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా రూ.99కి ఇప్పటికే “నిరీక్షణ” అనే చిత్రాన్ని విడుదల చేశామని, రెండవ సినిమాగా “లవ్ యూ టూ” చిత్రాన్ని కేవలం రూ.39లకే 16 జూన్, 2023న ఏపీఎస్ఎఫ్‌ఎల్ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నామన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్ స్ర్కైబర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సబ్ స్ర్కైబ్ చేసుకున్నప్పటి నుంచి 24 గంటల వరకు సినిమాను చూసే అవకాశం ఉంటుందన్నారు.

ఏపీఎస్ఎఫ్ఎల్ ను ఒక థియేటర్‌గానే భావించాలన్నారు. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదని, మారుమూల ప్రాంతాలకు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో విధానాన్ని చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ అమలు చేస్తున్న విధానంపై నిర్మాతల మండలి, పలువురి నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కొందరు చేస్తున్న విమర్శలను సద్విమర్శలుగా భావిస్తున్నామన్నారు.

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 ప్రకారం రూ.100 కోట్ల బడ్జెట్ మూవీకి మొదటి వారంపాటు టిక్కెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగరోజుల్లో, మరే సందర్భంలోనైనా విడుదల చేసే అవకాశం కల్పించారు. ప్రతి థియేటర్‌లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించారు.

రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలను కూడా ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేసే అవకాశం వస్తుందని తెలుస్తోంది. ఏపీఎస్ఎఫ్ఎల్ త్వరలోనే ఒక యాప్‌ను రూపొందించనుంది. ఇకపై యాప్ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా వీక్షించే అవకాశం లభించనుంది.

Read Also : AP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading