Progressive Andhra Pradesh: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్న సీఎం వైయస్ జగన్.. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గాడిలో పెడుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడం మాత్రమే కాదు.. కుటుంబాల ఆర్థిక స్వావలంబనతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగేందుకు జగనన్న చర్యలు దోహదపడుతున్నాయి. తాజాగా ఆర్బీఐ నివేదికలోనూ ఈ విషయం తేటతెల్లమైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం 2022–23 రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11,65,179 కోట్లు. అంటే.. నాలుగేళ్లలో రూ.3,74,369 కోట్లు పెరుగుదల నమోదైంది. రాష్ట్ర తలసరి ఆదాయం గత నాలుగేళ్లలో రూ.65,487 పెరిగింది. (Progressive Andhra Pradesh)
ఓ కుటుంబం బాగుపడాలంటే ఆర్థికంగా చేయూత ఇవ్వాలని భావించిన సీఎం జగన్.. వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, జగనన్న తోడు లాంటి పథకాలతో ఆర్థికపరిపుష్టి ఇస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం ద్వారా రైతన్న ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చేయగలుగుతున్నాడు. చిరువ్యాపారులకు అండగా నిలవడంతో వారి వ్యాపారాలు పెరిగాయి. సమాజంలో అన్ని వర్గాలనూ ఆదుకోవడం ద్వారా ఎకనమిక్ సైకిల్ వేగం అందుకుంది. డీబీటీ, నాన్‌డీబీటీ అమలు ఫలితంగా రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం భారీగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో నమోదవుతున్న వృద్ధి ప్రభావం.. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో స్పష్టంగా కనిపిస్తోంది.
- వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ.13,500. ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.31,005 కోట్లు. వైయస్సార్ సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లిస్తే వారి ఖాతాల్లోకి జమ చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటి వరకు వ్యయం రూ.3,615.28 కోట్లు. జగనన్న తోడు కింద చిరువ్యాపాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తున్న జగనన్న. ఒక్కొక్కిరికి రూ.10,000 వడ్డీ లేని రుణం. ఇప్పటి వరకు వ్యయం రూ.2,955.79 కోట్లు.
- వైయస్సార్ చేయూత ద్వారా 45–60 ఏళ్ల మధ్య వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,500 చొప్పున ఇస్తున్న జగనన్న ప్రభుత్వం. నాలుగేళ్లలో రూ.75,000 అందిస్తూ జీవనోపాధికి తోడ్పాటు. ఇప్పటి వరకు వ్యయం రూ.14,129.12. మూడు విడతల్లో రూ.3,517.43 కోట్ల వ్యయంతో 3.37 లక్షల మందికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు పాడి పశువులు, మరో 1.32 లక్షలకుపైగా అక్కచెల్లెమ్మలకు గొర్రెలు, మేకల పంపిణీ.
- అక్కచెల్లెమ్మల జీవనోపాధి పెంచేలా అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, పీఅండ్‌జీ, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్ర లాంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, ఇతర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.10,000 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. వైయస్సార్ కాపు నేస్తం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసుగల కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ఐదేళ్లపాటు ఏటా రూ.15,000 చొప్పున రూ.75,000 అందజేత.
- వైయస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో రూ.45,000 ఆర్థికసాయం.
– వైయస్సార్ ఆసరా కింద ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల సొమ్ము రూ.25,571 కోట్లు. నాలుగు వాయిదాల్లో చెల్లింపు. ఇప్పటి వరకు వ్యయం రూ.19,178.17 కోట్లు. - ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లలో వచ్చిన ఎంఎస్‌ఎంఈలు చూస్తే.. మొత్తం పరిశ్రమలు 2,00,995. పెట్టుబడులు రూ.24,059 కోట్లు. ఉద్యోగాలు 12,61,512
ఆర్బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు
- 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.7,90,810 కోట్లు ఉండగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.11,65,179 కోట్లకు పెరిగింది.
- ముఖ్యంగా 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతోంది.
- 2018–19లో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ ఆర్థిక కార్యకలాపాల నికర విలువ రూ.2,61,448 కోట్లు ఉంది. ఈ విలువ ఏటా పెరుగుతూ 2022–23లో రూ.4,16,441 కోట్లకు చేరింది.
- తయారీ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.67,393 కోట్లు ఉండగా 2022–23కి రూ.89,180 కోట్లకు పెరిగింది.
- నిర్మాణ రంగం ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.56,106 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.76,694 కోట్లకు పెరిగింది.
- రియల్ ఎస్టేట్, యాజమాన్యం, నివాసం, వృత్తిపరమైన సేవల ఆర్థిక కార్యకలాపాల విలువ 2018–19లో రూ.58,147 కోట్లు ఉండగా 2022–23కి రూ.82,775 కోట్లకు పెరిగింది.
- రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా గత నాలుగేళ్లుగా పెరుగుతూనే ఉంది.
- 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షలు దాటింది.
- 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031 ఉండగా 2022–23కి రూ. 2,19,518కు పెరిగింది.ఇదీ చదవండి: Why not 175: 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? గేర్ మార్చాల్సిందేనన్న సీఎం జగన్