Tirumala News 05-08-2023: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తుల తాకిడి పెరిగింది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు వేంకటరమణుడి సర్వ దర్శన భాగ్యం కోసం 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,270 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,755 మంది. శ్రీవారికి హుండీ ఆదాయం నిన్న రూ.3.74 కోట్లు చేకూరిదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. (Tirumala News 05-08-2023)
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఈనెల 27 నుంచి 29 వరకు శ్రీనివాసుడి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. 25వ తేదీన పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
ఈనెల 12న స్వచ్ఛ తిరుమల-శుద్ధి తిరుమల కార్యక్రమం
ఈనెల 12వ తేదీన స్వచ్ఛ తిరుమల-శుద్ధి తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం తలపెట్టారు. ఇందులో విద్యార్థులు, NCC క్యాడెట్లు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించనున్నారు.
Read Also : Buggana on AP Appulu: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ఏ ఢోకా లేదు.. అప్పులపై వాస్తవాలు ఇవీ!: బుగ్గన