Tirumala News 01-08-2023: తిరుమలలో నేడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. నేటి నుంచి నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేయనున్న సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు పుష్కరిణి హారతిని టీటీడీ రద్దు చేసింది. (Tirumala News 01-08-2023)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,601 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 23,396 మంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు చేకూరిందని టీటీడీ పేర్కొంది.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పై ఈవో సమావేశం
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పై ఈవో సమావేశం నిర్వహించారు. అధికమాసంతో 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18న ధ్వజావరోహణం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, సెప్టెంబర్ 25న మహా రథోత్సవం, 26న చక్రస్నానం ఉంటాయని ఈవో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని, మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. గరుడసేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనసేవ తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
తిరుచానూరులో గంజాయితో దొరికిన లా విద్యార్థులు
తిరుచానూరులో కొందరు విద్యార్థులు పక్కదారి పట్టారు. లా విద్యార్థులు గంజాయితో దొరికిన ఘటన వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన సెల్వరాజ్, తనుష్ కృష్ణన్ గంజాయికి అలవాటుపడినట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కాలేజీలో విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. లక్ష రూపాయల విలువైన గంజాయి స్వాధీనం చేసున్నారు.
Read Also : Gold rates today 01-08-2023: తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి పసిడి, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..