Gold rates today 01-08-2023: బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఇండియాలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.100, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 చొప్పున తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం మారలేదు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులన్నీ వడ్డీ రేట్ల పెంపుపై ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధర షాక్ ఇచ్చి భారీగా పుంజుకుంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,005 డాలర్ల వద్దకు చేరింది. (Gold rates today 01-08-2023)
తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,250గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,280 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.80,000 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.55,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.60,280 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.80,000 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.55,500 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.
దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.55,250గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.60,280 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.55,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,430 గా నమోదైంది. జైపూర్, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.
మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.520 పెరిగింది. రూ.25,110 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.
Read Also : Parliament session: వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయంపై కేంద్రం కీలక ప్రకటన