Fiber net Scam: ఫైబర్‌నెట్‌లో చంద్రబాబు రూ.114 కోట్లు దోచేశారు

Fiber net Scam: అనుకూల వ్యక్తులకే టెండర్లు కట్టబెట్టి షెల్‌ కంపెనీల ద్వారా రూ.114 కోట్ల ప్రజాధనాన్ని అడ్డగోలుగా చంద్రబాబు దోచుకున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఫైబర్‌నెట్, స్కిల్‌ స్కామ్‌లపై అసెంబ్లీలో నిన్న స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. (Fiber net Scam)

 • చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ.114 కోట్లు కొట్టేశారు.
 • 2021లో ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది.
 • వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను మెంబర్‌ ఆఫ్‌ ద గవర్నింగ్‌ కౌన్సిల్‌గా చంద్రబాబు నియమించారు. ఈయన ప్రధాన ముద్దాయి. ఈవీఎంలను హ్యాక్‌ చేసిన కేసులో నిందితుడు.
 • ఫైబర్‌నెట్‌కు సంబంధించి 24 వేల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌లైన్స్‌ టెక్నికల్‌ కమిటీ, టెండర్‌ ఎవ్యాల్యుయేషన్‌ కమిటీల్లో ఈయన మెంబర్‌.
 • హెరిటేజ్‌సంస్థల్లో డైరెక్టర్‌గా పని చేసిన దేవినేని సీతారామయ్య.. టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు డైరెక్టర్‌గా 14 సంవత్సరాలు పని చేశాడు.
 • అనేక హెరిటేజ్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా పని చేశాడు.
 • ఏ ప్రాజెక్టును అయితే టెరా సాఫ్ట్‌వేర్‌కు అప్పగించాలనుకున్నారో ఆ సంస్థను 11–05–2016న సివిల్‌ సప్లయ్స్‌ సంస్థకు చెందిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మిషీన్స్‌లో అవకతవకలకు సంబంధించి టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టారు.
 • రూ.333 కోట్ల ఫైబర్‌గ్రిడ్‌ టెండర్‌కు ఆఖరు తేదీ జూలై 31. అప్పటికి టెరాసాఫ్ట్‌ బ్లాక్‌ లిస్టులోనే ఉంది. అలాంటి సంస్థకు మళ్లీ అవకాశం ఇవ్వడానికి టెండర్‌ తేదీని వారం రోజులు పొడిగించారు.
 • టెండర్లలో పాల్గొనేలా టెరాసాఫ్ట్‌కు అవకాశం కల్పించాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకోసం దొడ్డి దారిన సివిల్‌సప్లయ్స్‌కు సంబంధించిన ఒక జనరల్‌ మేనేజర్‌ స్థాయి వ్యక్తి దాన్ని బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించేలా చేశారు.

  టెరాసాఫ్ట్‌ బాబు బినామీదే

 • టెరాసాఫ్ట్‌కు తుమ్మల గోపీచంద్‌. ఆయన భార్యపేరు పావనీదేవి. దీనికి అనుబంధ కంపెనీ కంపెనీ టెరా మీడియా క్లౌడ్‌ కంపెనీ ఉంది. అందులో ఒక డైరెక్టర్‌ వేమూరి హరిప్రసాద్‌. అందుకే ఇదంతా ఇప్పించుకొని డబ్బులు వారి గురువు చంద్రబాబుకు చేరేలా చేశారు.
 • టెండర్‌ ప్రక్రియలో భాగంగా 07–08–2015న ప్రాసెస్‌ జరిగితే అందులో అప్పుడున్న ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ సుందర్‌ ఓ లేఖ రాశారు.
 • గవర్నమెంట్‌ యాక్టివిటీస్‌లో ఎక్కడా టెరాసాఫ్ట్‌వేర్‌ ఫెర్ఫార్మెన్స్‌ బాగోలేదని రాశారు.
 • ఎల్‌2కి ఇస్తే బాగుంటుందని లెటర్‌లో పేర్కొన్నారు.
 • దీనిపై మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఎవాల్యుయేట్‌ చేశాం. ఇందులో 100కి 75 పాయింట్లు మాత్రమే వచ్చాయి.
 • ఇంత క్లియర్‌గా ఓ అధికారి ఆరోజు ఇది కరెక్ట్‌ కాదని చెప్పినందుకు వారికి ఇచ్చిన 19–08–2015న లెటర్‌ రాస్తే, 24–08–2015న ట్రాన్స్‌ఫర్‌ అయిపోయాడు.
 • చంద్రబాబు ఆదేశాలతో అధికారిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు.
 • తర్వాత టెరా సాఫ్ట్‌వేర్‌కు కాంట్రాక్ట్‌ అప్పగించారు.
 • టెండర్‌ ప్రాసెస్‌ పూర్తయి, కాంట్రాక్టు ఇచ్చేసిన తర్వాత బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో ఎవరికీ అనుమానం రాకుండా సెప్టెంబర్‌ 8న టెరా మీడియా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు.
 • చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్‌ టెండర్‌ కట్టబెట్టారు.
 • షెల్‌ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు.
 • 2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైయస్‌ జగన్‌ ఎండగట్టారు.

  ఇదీ చదవండి: AP Fiber: విడుదలైన రోజే ఇంట్లో కొత్త సినిమా చూసేయండిలా..!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles