Letter from President Bhavan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ వచ్చింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా ఈ లేఖ రాశారు. జడ్జి హిమబిందు పై సోషల్ మీడియా లో అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల పోస్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సీఎస్ కు రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా ఆదేశాలు ఇచ్చారు. (Letter from President Bhavan)
పోస్టులు పెడుతున్న వారిపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుకి వివరించాలంటూ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు రిమాండ్ తర్వాత జడ్జి హిమబిందు ను కించపరుస్తూ టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రపతికి ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
చంద్రబాబు రిమాండ్‌కు వెళ్లిన తర్వాత 16 రోజుల నుంచి జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు కొందరు పెడుతున్నారు. ఈ పోస్టులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోస్టులను వైరల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పోస్టుల వల్ల ఆమె హోదా, గౌరవాన్ని కించపరిచినట్లవుతుందని సీనియర్ జర్నలిస్టు, హైకోర్టు న్యాయవాది రామానుజం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన జడ్జి హిమబిందు తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెను విమర్శిస్తూ, వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎంత వరకుసబబు అని ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలు, పోస్టులు చేసే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: Chandrababu CID Custody: చంద్రబాబుకు వంద ప్రశ్నలు.. సీఐడీ విచారణలో నిజం నిగ్గు తేలుతుందా?
Vijayasai Reddy on CBN: బాబు కనిపెట్టిన వాటికి కేంద్రం పేటెంట్ హక్కులు కోరాలి: సైరా సెటైర్లు
CBN remand: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు : చంద్రబాబు
Chandrababu Scams: చంద్రబాబుకు క్యూలో వరుస కేసులు.. వెయిటింగ్‌లో ఇన్నర్ రింగు రోడ్డు స్కామ్!