Gudivada Amarnath on CBN: చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై రెండు రోజులుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పడం లేదన్నారు. (Gudivada Amarnath on CBN)
చంద్రబాబుది చీకటి చరిత్ర అని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. బాబు ఎదుగుదలలో ముందూ వెనుక ఆస్తుల గురించి ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకునిపై ఇన్ని కుంభకోణాలు లేవన్నారు. ఏలేరు స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబు ప్రమేయం తెలియంది కాదన్నారు. ఐటీ నోటీసులిస్తే తేలు కుట్టిన దొంగలా ఉన్నాడంటూ చంద్రబాబుపై అమర్‌నాథ్ మండిపడ్డారు.
అన్నా హజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. రూ.120 కోట్ల లంచాలు తీసుకున్నావని చెబుతుంటే సంబంధం లేని లేఖ రాస్తున్నారన్నారు. మీకు సంబంధం లేదని ఎందుకు సమాధానం చెప్పడం లేదని మంత్రి నిలదీశారు. బాబు దొరికిపోయారని మీకు తెలుసన్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చింది తీగ… ఇంకా డొంక కదలాలని వ్యాఖ్యానించారు.
2020 నుంచి జూన్ వరకు 4 నోటీసులు ఇచ్చారని అమర్‌నాథ్ గుర్తు చేశారు. సంబంధం లేదని వివరణ ఇస్తారని, తాను మీ జురిస్‌డిక్షన్ లో లేనని అంటారన్నారు. అమరావతిలో దొంగతనం చేసి కనకదుర్గ వారధి దగ్గర ఎందుకు పట్టుకున్నారని పోలీసులను ప్రశ్నించినట్టు చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు.
ఎంవీపీ అనే వ్యక్తి కంపెనీల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు మీడియేటర్ గా పని చేసినట్టు తేలిందని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారని తెలిపారు. రూ.350 కోట్లు అత్యవసర కేబినెట్ ద్వారా మళ్లించారని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి పేరిట ఎంతో అవినీతికి పాల్పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అవినీతి బాబు కథ విచారణకు ఈడీ జోక్యం చేసుకోవాలని మంత్రి కోరారు.
ఇదీ చదవండి: IT Notice to CBN: చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు.. ఇప్పటి వరకు రియాక్షన్ లేదెందుకు? తేలుకుట్టిన దొంగేనా?