సోమవారం, 21 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Tollywood : పుష్ప 2లో క్షణం మాత్రమే కనిపించింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం సంచలనం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 8 నవంబర్ 2025

Tollywood : అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘పుష్ప 2’ ప్రేక్షకులను ఊపేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌లో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

అయితే సినిమాలో ఒక చిన్న సీన్‌లో కనిపించిన బాలీవుడ్‌ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్పరాజ్‌’ ఎర్రచందనం అంతర్జాతీయ డీల్ చేసే సీన్‌లో అతనితో పాటు కనిపించిన ఆ చిన్నది ఎవరో తెలుసా?

ఆమె పేరు ఆంచల్ ముంజల్ (Anchal Munjal). చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, తన అందంతో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఆమె పేరు కోసం కుర్రాళ్లు తెగ వెతికారు.

బాలనటిగా బీ–టౌన్‌ టెలివిజన్‌లో కెరీర్‌ ప్రారంభించిన ఆంచల్‌ 2008లో ‘ధూమ్ మచావో ధూమ్’ సీరీస్‌తో తన నటనా ప్రస్థానం మొదలుపెట్టింది. 2010లో కరీనా కపూర్‌, అర్జున్ రాంపాల్‌ నటించిన ‘We Are Family’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత ‘ఘోస్ట్ బనా దోస్త్’, ‘పర్వర్రిష్’, ‘బడే అచ్చే లగ్తే హై’, ‘ప్రేట్ బాయ్స్’ వంటి టీవీ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే ‘ఘాయల్: వన్స్ అగైన్’, ‘ఆరక్షన్’, ‘ముంబై స్పెషల్ 6’ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో ‘సే’ అనే సినిమాలో కూడా కనిపించింది.

ఇక ‘పుష్ప 2’ ద్వారా ఆమెకు పాన్‌ ఇండియా స్థాయిలో కొత్త క్రేజ్‌ వచ్చింది. సినిమా లో ఒక్క సీన్‌ మాత్రమే వచ్చినా, అభిమానులు ఆమె ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్‌ చేస్తూ ట్రెండ్‌ చేశారు.

View this post on Instagram

ఆంచల్ ముంజల్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తరచూ గ్లామరస్‌ ఫోటోలు, రీల్స్‌ షేర్‌ చేస్తుంది. తన స్టైలిష్ లుక్స్‌, కాన్ఫిడెన్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. ఆమె తాజా పోస్టులపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

View this post on Instagram

ఇవీ చదవండి: Tollywood : నాగార్జున, బాలకృష్ణతో హిట్స్ ఇచ్చిన హీరోయిన్.. పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ!
Heroine : తెలుగులో ఫ్లాప్‌లు.. మలయాళంలో రూ.300 కోట్ల హిట్‌ కొట్టిన స్టార్ హీరోయిన్‌

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading