ఆదివారం, 20 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Ajay Ghosh : ఆ హీరో నిజంగా గొప్పవాడు… అంత పెద్దవాడైనా చాలా ఒదిగి ఉంటాడు: అజయ్ ఘోష్ వ్యాఖ్యలు వైరల్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 25 డిసెంబర్ 2025

Ajay Ghosh : టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు… క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ ప్రత్యేక నటనతో ప్రేక్షకుల మనసుల్లో బలమైన స్థానం సంపాదించుకుంటున్నారు. అలాంటి విలక్షణ నటుల్లో ఒకరు Ajay Ghosh. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు పవర్‌ఫుల్ క్యారెక్టర్లను సమర్థవంతంగా పోషిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Rangasthalam, Pushpa వంటి సినిమాల్లో అజయ్ ఘోష్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ఒకేలా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలోని పాత్రల్లో ఆయన ఒదిగిపోయే నటన సినిమాలకు మరింత ప్రాణం పోసింది.

రంగస్థలం సెట్స్‌లో కుటుంబ వాతావరణం

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఘోష్ ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలోని అనుభవాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. షూటింగ్‌కి వెళ్లి కారు దిగి, బట్టలు మార్చుకుని మేకప్ వేసుకున్న తర్వాత తాము నటులు కాదని, పాత్రలే అయ్యేవాళ్లమని చెప్పారు. సోమరాజు, చిన్నబాబు, శేషు నాయుడు, చిట్టిబాబు, రామలక్ష్మి వంటి పాత్రలన్నీ సెట్స్‌పై సజీవంగా మారిపోయేవని గుర్తుచేసుకున్నారు.

సెట్‌లో దాదాపు 200 నుంచి 300 మంది జనాలు, గ్రామీణ వేషధారణలో ఉండటంతో నిజంగానే ఒక పల్లెటూరులో ఉన్న భావన కలిగేదని తెలిపారు. సిటీ నుంచి వచ్చినప్పటికీ గ్రామీణ వాతావరణానికి అలవాటు పడటం పెద్దగా కష్టం అనిపించలేదని చెప్పారు. అంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి పని చేయడం వల్ల షూటింగ్ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని వెల్లడించారు.

రామ్ చరణ్‌పై మనసు కరిగే మాటలు

ఈ సందర్భంగా Ram Charan గురించి అజయ్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“చరణ్ చాలా మంచి మనిషి. చిన్నా–పెద్దా అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తారు. పెద్ద హీరో, Chiranjeevi గారి కొడుకు అనే గర్వం ఏమాత్రం ఉండదు… చాలా ఒదిగి ఉంటాడు” అని ప్రశంసించారు.

ఒక ఫైట్ సీన్ సమయంలో తన కాలుకు గాయమైతే, చరణ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ‘ఏమైంది అండి?’ అంటూ అడిగి, తన కాలుకు ప్యాడ్స్ పెట్టించి, అపోలో హాస్పిటల్‌కి ఫోన్ చేసి పంపించారని చెప్పారు. అక్కడ పూర్తిగా స్కాన్లు చేయించారని, డాక్టర్లు నెలన్నర బెడ్ రెస్ట్ సూచించినా, ఆ సమయంలో కూడా చరణ్ రోజూ తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునేవారని తెలిపారు.

అజయ్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తూ, రామ్ చరణ్ వ్యక్తిత్వానికి మరోసారి అద్దం పట్టాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి: Pawan Kalyan : పవన్ ప్రేయసి.. రామ్ చరణ్ అక్కగా నటించిన భామ ఎవరో తెలుసా?
Ram Charan Bandage: రామ్ చరణ్ చేతికి గాయం? వీడియో వైరల్

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading