IPL Brand Valuation 2026: క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. వేల కోట్ల రూపాయల వ్యాపారం కూడా అని మరోసారి నిరూపించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ప్రపంచంలోని అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటిగా ఎదిగిన ఐపీఎల్.. 2026లో మరో కీలక మైలురాయిని అందుకుంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ Houlihan Lokey వెల్లడించిన IPL Valuation Study 2026 ప్రకారం లీగ్ మొత్తం బిజినెస్ వాల్యూ ఏకంగా $20.6 బిలియన్లకు చేరింది.
గత ఏడాది $18.5 బిలియన్లుగా ఉన్న IPL బిజినెస్ వాల్యూ ఈసారి సుమారు 11.4 శాతం పెరిగి $20.6 బిలియన్లకు చేరడం విశేషం. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.2 లక్షల కోట్ల స్థాయి. అంతేకాదు IPL స్వతంత్ర బ్రాండ్ విలువ కూడా 10.3 శాతం పెరిగి $4.3 బిలియన్లకు చేరింది. దీంతో క్రికెట్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, అడ్వర్టైజింగ్‌ను కలిపిన భారీ వ్యాపార వ్యవస్థగా IPL మరింత బలపడుతోంది.
RCBదే నంబర్ వన్ స్థానం
2026 IPL Brand Valuationలో ప్రధాన ఆకర్షణ Royal Challengers Bengaluru (RCB). వరుసగా రెండో ఏడాది అత్యంత విలువైన IPL ఫ్రాంచైజీ బ్రాండ్‌గా RCB అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025లో RCB బ్రాండ్ విలువ $269 మిలియన్లుగా ఉండగా, 2026లో అది ఏకంగా $312 మిలియన్లకు పెరిగింది. తద్వారా $300 మిలియన్ల బ్రాండ్ వాల్యూ మార్కును దాటిన తొలి IPL ఫ్రాంచైజీగా RCB కొత్త రికార్డు నెలకొల్పింది.
RCBకు ఉన్న భారీ అభిమాన గణం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో బలమైన ఫాలోయింగ్, స్పాన్సర్‌షిప్ అవకాశాలు, బ్రాండ్ గుర్తింపు, ఇటీవలి విజయాలు.. జట్టు కమర్షియల్ వాల్యూ పెరగడంలో కీలకంగా మారాయి.
రెండో స్థానంలో Mumbai Indians
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన Mumbai Indians (MI) బ్రాండ్ వాల్యూ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. MI బ్రాండ్ విలువ $264 మిలియన్లుగా అంచనా వేశారు.
మైదానంలో ఒక సీజన్ ఫలితాల కంటే దీర్ఘకాల విజయాలు, భారీ అభిమాన గణం, బలమైన యాజమాన్య వ్యవస్థ, స్పాన్సర్‌షిప్‌లు, కమర్షియల్ పార్ట్‌నర్‌షిప్‌లు వంటి అంశాలు ఫ్రాంచైజీ బ్రాండ్ విలువపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే ఫలితాల్లో హెచ్చుతగ్గులు ఉన్నా MI బ్రాండ్ బలంగా కొనసాగుతోంది.
KKR, CSK మధ్య స్వల్ప తేడా
మూడో స్థానంలో Kolkata Knight Riders (KKR) నిలిచింది. KKR బ్రాండ్ విలువ $245 మిలియన్లకు చేరింది. 2024లో టైటిల్ గెలవడం, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, బలమైన బ్రాండ్ గుర్తింపు KKRకు కలిసొచ్చే అంశాలు.
ఇక ఐదుసార్లు IPL ఛాంపియన్ Chennai Super Kings (CSK) $244 మిలియన్ల బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. KKR, CSK మధ్య కేవలం $1 మిలియన్ తేడా మాత్రమే ఉండటం గమనార్హం.
CSKకు దీర్ఘకాలంగా ఉన్న ఫ్యాన్ బేస్, విజయవంతమైన చరిత్ర, స్టార్ పవర్ కారణంగా జట్టు బ్రాండ్ ఇప్పటికీ IPLలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటిగా కొనసాగుతోంది.
SRH ఐదో స్థానంలో..
Sunrisers Hyderabad (SRH) $168 మిలియన్ల బ్రాండ్ విలువతో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత Rajasthan Royals (RR) $161 మిలియన్లతో ఆరో స్థానంలో ఉంది.
తాజా 2026 ర్యాంకింగ్స్ ప్రకారం Gujarat Titans $158 మిలియన్లతో ఏడో స్థానంలో, Delhi Capitals $157 మిలియన్లతో ఎనిమిదో స్థానంలో, Punjab Kings $156 మిలియన్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. Lucknow Super Giants (LSG) $122 మిలియన్లతో పదో స్థానంలో నిలిచింది.
IPL Teams Brand Value 2026
| Rank | Team | Brand Value |
|---|---|---|
| 1 | Royal Challengers Bengaluru | $312 Million |
| 2 | Mumbai Indians | $264 Million |
| 3 | Kolkata Knight Riders | $245 Million |
| 4 | Chennai Super Kings | $244 Million |
| 5 | Sunrisers Hyderabad | $168 Million |
| 6 | Rajasthan Royals | $161 Million |
| 7 | Gujarat Titans | $158 Million |
| 8 | Delhi Capitals | $157 Million |
| 9 | Punjab Kings | $156 Million |
| 10 | Lucknow Super Giants | $122 Million |
IPL విలువ ఎందుకు ఇంత వేగంగా పెరుగుతోంది?
ఐపీఎల్ ఆదాయం కేవలం మ్యాచ్ టికెట్లతోనే పరిమితం కాదు. మీడియా రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్, స్పాన్సర్‌షిప్స్, టీమ్ పార్ట్‌నర్‌షిప్స్, మెర్చండైజింగ్, లైసెన్సింగ్ వంటి అనేక మార్గాల్లో భారీగా ఆదాయం వస్తోంది.
అదే సమయంలో IPLకు భారత్‌తో పాటు విదేశాల్లోనూ ప్రేక్షకుల సంఖ్య పెరగడం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కోట్లాది మందికి చేరువ కావడం దీని కమర్షియల్ విలువను మరింత పెంచుతోంది. ఫ్రాంచైజీల్లో పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ కూడా IPL వ్యాపార సామర్థ్యాన్ని సూచిస్తోంది.
RCBకు టైటిల్స్‌తో పాటు వాల్యుయేషన్‌లోనూ జోరు
RCB ఒకప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ IPL ట్రోఫీ సాధించలేదనే విమర్శను ఎదుర్కొంది. 2025లో తొలి IPL టైటిల్ సాధించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2026లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచి వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఆన్‌ఫీల్డ్ విజయాలకు భారీ అభిమాన గణం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్, స్టార్ ప్లేయర్ల ప్రభావం తోడవడంతో RCB కమర్షియల్ బ్రాండ్ మరింత బలపడింది. ఫలితంగా $300 మిలియన్ల మార్కును దాటిన తొలి IPL టీమ్ బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది.
మొత్తంగా చూస్తే IPL ఇప్పుడు రెండు నెలల క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. $20.6 బిలియన్ల బిజినెస్ వాల్యూతో ప్రపంచ క్రీడా వ్యాపారంలో బలమైన బ్రాండ్‌గా ఎదుగుతోంది. మరోవైపు RCB, MI, KKR, CSK వంటి జట్ల మధ్య మైదానంలోనే కాకుండా బ్రాండ్ వాల్యూ విషయంలోనూ ఆసక్తికర పోటీ కొనసాగుతోంది.
Read also: IPL 2027: ఐపీఎల్ 2027 విజేత ఎవరు? RCB ఫ్యాన్ ప్రశ్నకు ధోనీ అదిరిపోయే రిప్లై.. వైరల్ అవుతున్న వీడియో
IPL 2026 First Match: RCB ఘన విజయం: ఐపీఎల్ 2026 సీజన్ బోణీ మ్యాచ్‌లో SRHను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంపియన్
WPL 2026 Final Winner: RCB ఉమెన్ వరుసగా రెండోసారి ఛాంపియన్.. వడోదర వేదికగా ఢిల్లీపై థ్రిల్లింగ్ విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ
