HomeCinemaManasa Sharma: టాలీవుడ్‌లో ట్రెండింగ్ లేడీ డైరెక్టర్… ఎవరు ఈ మానస శర్మ?

Manasa Sharma: టాలీవుడ్‌లో ట్రెండింగ్ లేడీ డైరెక్టర్… ఎవరు ఈ మానస శర్మ?

Manasa Sharma: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక కొత్త పేరు బాగా వినిపిస్తోంది. అదే Manasa Sharma. షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే తన ప్రతిభను చూపించిన ఆమె ఇప్పుడు ‘Rakasa’ సినిమాతో దర్శకురాలిగా పెద్ద తెరపైకి అడుగుపెడుతోంది. సినిమా ప్రమోషన్లతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

1. యూట్యూబ్ నుంచి మొదలైన ప్రయాణం
మానస శర్మది ఆంధ్రప్రదేశ్‌లోని Srikakulam. ఆమె కెరీర్ యూట్యూబ్ ప్రాజెక్టులతో ప్రారంభమైంది. 2019లో Niharika Konidelaకు చెందిన ప్రొడక్షన్ హౌస్‌లో ‘Mad House’ యూట్యూబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేసింది.

2. వెబ్ సిరీస్‌లతో గుర్తింపు
తర్వాత Oka Chinna Family Story వెబ్ సిరీస్‌కు క్రియేటర్‌, రచయితగా పనిచేసింది. ఆ తర్వాత వచ్చిన Bench Life వెబ్ సిరీస్‌తో దర్శకురాలిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సిరీస్ SonyLIVలో స్ట్రీమింగ్ అయి మంచి స్పందన పొందింది.

3. ‘రాకాస’తో వెండి తెరపైకి
ఇప్పుడు మానస శర్మ ‘Rakasa’ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకురాలిగా అడుగుపెడుతోంది. ఈ సినిమాలో Sangeeth Shobhan, Nayan Sarika హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 03న విడుదల కానుంది.

4. అందం, మాటతీరుతో ఆకట్టుకుంటున్న డైరెక్టర్
సినిమా ప్రమోషన్లలో మానస శర్మ మాట్లాడే తీరు, అమాయకత్వం చూసి చాలా మంది ఆకట్టుకుంటున్నారు. ఆమెను చూసి కొందరు Shamiliలా కనిపిస్తోందని కామెంట్లు కూడా చేస్తున్నారు.

5. హీరోయిన్‌గా కూడా ట్రై చేయొచ్చని నెటిజన్లు
మానస శర్మ అందం, ప్రెజెన్స్ చూసి నెటిజన్లు “డైరెక్షన్‌తో పాటు హీరోయిన్‌గా కూడా ప్రయత్నించొచ్చు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.

ఇవీ చ‌ద‌వండి: Virginity Loss : ప్రపంచంలో తొలి లైంగిక అనుభవం సగటు వయసు ఎంత? దేశాల వారీగా ఆసక్తికర గణాంకాలు
Telangana Crime : మామూలోడు కాదు.. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌ రౌడీషీటర్‌ సూరి మళ్లీ పోలీసుల వలలో!
Niharika Konidela: నిర్మాతగా దూసుకెళ్తున్న నిహారిక.. ‘రాకాస’పై ఆసక్తికర వ్యాఖ్యలు
Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు