Parent Care Act: ఇప్పటి వరకు తల్లిదండ్రులను చూసుకోవడం అనేది పిల్లల నైతిక బాధ్యతగా మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో అది చట్టబద్ధ బాధ్యతగా మారింది. అంటే ఇకపై తల్లిదండ్రులను చూసుకోవడం ఒక ఆప్షన్ కాదు, తప్పనిసరి బాధ్యతగా మారింది.
చూసుకోకపోతే జీతంలో 15% కోత
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, అతని జీతంలో 15 శాతం వరకు కోత విధించే అవకాశం ఉంటుంది. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. దీంతో వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.
మారుతున్న కుటుంబ వ్యవస్థే కారణం
ఇప్పటి సమాజంలో జాయింట్ ఫ్యామిలీలు తగ్గిపోవడం, ఉద్యోగాల కోసం పిల్లలు వేరే నగరాలు లేదా విదేశాలకు వెళ్లిపోవడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆర్థికంగా, భావోద్వేగంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ఈ చట్టం రక్షణగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వృద్ధుల హక్కుల రక్షణ లక్ష్యం
పెద్దలను నిర్లక్ష్యం చేయడం, ఒంటరిగా వదిలేయడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పిల్లలు బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకోవాలని గుర్తు చేయడం, వృద్ధుల హక్కులను రక్షించడం ఈ యాక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.
యాక్ట్‌పై సందేహాలు కూడా
ఇదిలా ఉంటే ఈ చట్టంపై కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే యాక్ట్ అమలవుతుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ వివాదాలు కూడా ఉండే అవకాశం ఉండడంతో ఈ చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందా? అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇవీ చదవండి: Good News Telangana: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంటికే DL, RC కార్డులు
Telangana Jagruthi: తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. కవిత కొత్త పార్టీ ప్రకటన
Telangana Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధులు తొలి విడతలో ఎవరెవరికి వస్తాయంటే..
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్లో గుడ్ న్యూస్.. ఇందిరమ్మ కుటుంబ జీవన బీమాతో ప్రభుత్వం భరోసా
