HomeTelanganaGood News Telangana: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంటికే DL, RC కార్డులు

Good News Telangana: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంటికే DL, RC కార్డులు

Good News Telangana: తెలంగాణలో వాహనదారులకు పెద్ద ఊరట కలిగించే కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కార్డుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ సిస్టమ్ ద్వారా కార్డులను నేరుగా ఇంటికే పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

1. ఒకే కేంద్రం నుంచి DL, RC కార్డుల ప్రింటింగ్
ఇప్పటివరకు రాష్ట్రంలోని 61 ఆర్టీవో కార్యాలయాల్లోనే DL, RC కార్డులు ప్రింట్ చేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల చిరునామాలకు పంపిస్తారు.

2. ఆలస్యం, మధ్యవర్తుల సమస్యలకు చెక్
ప్రస్తుతం కార్డులు పొందడానికి వారాలు, కొన్ని సందర్భాల్లో నెలలు పడుతోంది. మధ్యవర్తుల జోక్యం కూడా ఎక్కువగా ఉంది. సెంట్రలైజ్డ్ వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

3. ఏటా లక్షల సంఖ్యలో కార్డులు
తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు 4.70 లక్షల డ్రైవింగ్ లైసెన్స్‌లు, దాదాపు 9.90 లక్షల వాహన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తం మీద ఏడాదికి సుమారు 14 నుంచి 15 లక్షల కార్డులు జారీ చేయాల్సి వస్తోంది.

4. అవినీతి ఆరోపణలకు బ్రేక్
గతంలో ఏసీబీ తనిఖీల్లో ఏజెంట్ల వద్ద వందలాది లైసెన్స్‌లు, ఆర్సీలు బయటపడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొత్త విధానంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోస్టల్ ద్వారా కార్డులు నేరుగా వాహనదారుల ఇంటికే చేరతాయి.

5. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రవాణా శాఖకు వచ్చే ఆదాయంలో భాగంగా ఈ వ్యవస్థను అమలు చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు ఆలస్యం, అవినీతి వంటి సమస్యలకు పెద్ద ఎత్తున చెక్ పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Good News: ఏపీ ప్రభుత్వరంగ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వయసు పెంపుకు గ్రీన్ సిగ్నల్?
Good News: కార్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..
Good News on Gas: వంటింట్లో గ్యాస్ బాధ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్.. గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య కీల‌క ప్ర‌క‌ట‌న

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు