HomeDevotionalNew Rules in Temples: తెలంగాణ‌లో ఆల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త...

New Rules in Temples: తెలంగాణ‌లో ఆల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్

New Rules in Temples: తెలంగాణలోని ప్రముఖ క్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తరహాలో ఆలయ పరిసరాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించి పలు మార్పులు సూచించారు. మొత్తం రూ.225 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

1. తిరుమల తరహా నిబంధనలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల మాదిరిగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం సూచించారు. ఆలయ ప్రాంతాల్లో రాజకీయ సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని ఆదేశించారు.

2. రూ.225 కోట్లతో అభివృద్ధి పనులు
బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.225 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

3. విశాలమైన రోడ్లు – భవిష్యత్ రద్దీకి ప్రణాళిక
భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ఆలయ పరిసరాలు పెద్ద వృక్షాలతో హరిత వాతావరణంగా ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు.

4. హెల్త్ సెంటర్ ఏర్పాటు
పుష్కరాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఆలయ సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని సీఎం అధికారులకు సూచించారు.

5. ఆలయ ప్రాంగణంలో EV వాహనాలకే అనుమతి
ప్రత్యేక వ్యక్తుల వాహనాలు కూడా ఆలయ ప్రాంగణంలోకి అనుమతించకూడదని సీఎం స్పష్టం చేశారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే ఆలయానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, పార్కింగ్ ప్రాంతంలో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవీ చ‌ద‌వండి: Telangana Group-1 Recruitment: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు… సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Ontimitta Kodandarama Temple: ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో పౌర్ణ‌మినాడే క‌ల్యాణం ఎందుకు?
Texas Hanuman Temple: టెక్సాస్‌లో హనుమాన్ ఆలయం వైరల్: ‘జాబ్ వీసాల కోసం ప్రార్థనలు’ వ్యాఖ్యలతో వివాదం
Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple: సింహాచలం అప్ప‌న్న భ‌క్తుల‌కు గుడ్ న్యూస్.. డిజిటల్ సేవలు ప్రారంభం.. కియోస్క్‌లతో క్షణాల్లో దర్శన టికెట్లు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు