AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. మొత్తం 300 పోస్టులు
హైకోర్టు నోటిఫికేషన్ కింద పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా
అసిస్టెంట్స్ – 78
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ – 50
టైపిస్ట్ – 44
కాపీయిస్ట్ – 34
కంప్యూటర్ ఆపరేటర్ – 31
ఎగ్జామినర్ – 27
ఆఫీస్ సబార్డినేట్ – 20
తో పాటు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.
2. ఇతర పోస్టుల వివరాలు
ఇవికాకుండా సెక్షన్ ఆఫీసర్ (5), సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ (1), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1), లైబ్రేరియన్ గ్రేడ్-II (1), యూడీ స్టెనోగ్రాఫర్ (7), స్టెనోగ్రాఫర్ (1) వంటి పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి.
3. అర్హతలు
పోస్టును బట్టి 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్, లా, ఎమ్మెస్సీ వరకు విద్యార్హతలు అవసరం. అలాగే కొన్ని పోస్టులకు టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా తప్పనిసరిగా ఉండాలి.
4. వయోపరిమితి
అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు
PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
5. ఎంపిక విధానం మరియు జీతం
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760 వరకు జీతం చెల్లిస్తారు.
6. దరఖాస్తు చివరి తేదీ
అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.
ఇవీ చదవండి: Telangana High Court : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు TGHC నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
Highways : హైవే నిర్మాణంలో భారత్‌కు ప్రపంచ గర్వకారణం.. అమరావతి–బెంగుళూరు కారిడార్‌కు ‘బీకేవీ’ పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచన
Madras High Court : తిరుప్పరంకుండ్రం హిల్ పై దీపాలు వెలిగించుకోవచ్చు.. హైకోర్టు మధురై బెంచ్ సంచలన తీర్పు.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు
