Ravi Mohan: తమిళ నటుడు Ravi Mohan మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకవైపు భార్యతో విడాకుల వ్యవహారం కొనసాగుతుండగా, మరోవైపు సింగర్ Kenisha Francisతో ఆయన డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా గోవాలో భూమి కొనుగోలు వ్యవహారం కూడా ఈ వివాదాన్ని మరింత పెంచింది.
గోవాలో భూమి కొనుగోలు
తాజా సమాచారం ప్రకారం రవి మోహన్, కెనీషా ఫ్రాన్సిస్ కలిసి గోవాలో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భూమి విలువ దాదాపు రూ.40–42 లక్షలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
‘అన్‌మ్యార్డ్’గా నమోదు?
రిజిస్ట్రేషన్ పత్రాల్లో రవి మోహన్ తన స్టేటస్‌ను “Unmarried”గా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయనకు చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కాలేదు.బదీంతో విడాకులు పూర్తి కాకముందే ఎలా “అన్‌మ్యార్డ్”గా నమోదు చేశారని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పొరపాటు జరిగి ఉండొచ్చా?
ఇక మరికొందరు మాత్రం ఇది రిజిస్ట్రేషన్ సమయంలో జరిగిన టెక్నికల్ తప్పిదం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. పత్రాలు నింపేటప్పుడు సిబ్బంది పొరపాటున ఆప్షన్‌ను ఎంపిక చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
భార్య ఆర్తితో విడాకుల వివాదం
రవి మోహన్ ప్రముఖ నిర్మాత Sujatha Vijayakumar కుమార్తె Aarti Raviని 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు – ఆరవ్, అయాన్ ఉన్నారు. 2024లో వీరిద్దరూ విడిపోయినట్లు ప్రకటించినప్పటికీ, చట్టపరంగా విడాకులు ఇంకా పూర్తికాలేదు.
పేరుమార్చుకున్న జయం రవి
తమిళ సినిమా Jayam ద్వారా హీరోగా గుర్తింపు పొందిన ఆయన ‘జయం రవి’గా ప్రసిద్ధి చెందారు. అయితే గతేడాది జనవరిలో తన పేరును అధికారికంగా “రవి మోహన్”గా మార్చుకున్నారు. ఇకపై అదే పేరుతో పిలవాలని అభిమానులను కోరారు.
ఇటీవల చేసిన సినిమా
ఇటీవల ఆయన Parasakthi సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఈ పాత్రతో ఆయన మరోసారి నటనలో కొత్త కోణాన్ని చూపించారు.
కోలీవుడ్‌లో చర్చ
ప్రస్తుతం గోవా ప్రాపర్టీ వ్యవహారం, డేటింగ్ రూమర్స్ కారణంగా రవి మోహన్ పేరు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై ఆయన నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.
Read also: Malavika Mohanan: ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాళవిక.. ది రాజా సాబ్ యాక్షన్ సీన్స్‌పై క్లారిటీ
Ravi Aarti divorce: రవి మోహన్–ఆర్తి విడాకుల వివాదం.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం
ID cards for Artists: కళాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
