Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ Prabhas హీరోగా, డైరెక్టర్ Maruthi దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ మూవీ The Raja Saab ఇటీవల ఓటీటీలో విడుదలై చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై ట్రోలింగ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఫేస్ స్వాప్, బాడీ డబుల్, డూప్ షాట్స్ అంశాలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్ Malavika Mohanan తన యాక్షన్ సీన్స్ విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజులుగా మాళవిక తన యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో, వాటికి ఆమె తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది.
మాళవిక ట్వీట్ చేస్తూ,
“ది రాజా సాబ్ చిత్రంలో నా స్టంట్స్ అన్నీ నేనే చేశాను. కానీ నా బదులుగా బాడీ డబుల్ ఆ ఫైట్స్ చేసినట్లుగా కొన్ని ఫోటోలు, కథనాలు చూస్తున్నాను. ఈ సినిమాలో నా స్టంట్ డబుల్ అయిన స్టంట్ ఆర్టిస్ట్ ఫోటో వైరల్ అవుతోంది. నేను యాక్షన్‌ను చాలా ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకుగా ఉండటం వల్ల నా శరీరాన్ని ఫిజికల్‌గా సవాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు ఇష్టం.”
అలాగే ఆమె మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించింది.
“నటీనటులు స్వయంగా స్టంట్స్ చేసినా కూడా సెట్స్‌లో ఎప్పుడూ ఒక స్టంట్ డబుల్ ఉంటారు. యాక్షన్ డైరెక్టర్ ముందుగా వారితో రిహార్సల్ చేయిస్తారు. కొన్నిసార్లు రిస్కీ షాట్స్ ప్రొఫెషనల్స్‌తో చేయించాల్సి వస్తుంది. నాకు శిక్షణ ఇచ్చిన నా స్టంట్ డబుల్‌కు బిగ్ హగ్.”
మాళవిక తన యాక్షన్ సీన్స్ షూటింగ్‌కు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేయడంతో, సినిమాలోని చాలా యాక్షన్ సీన్స్ ఆమెనే స్వయంగా చేసినట్టు స్పష్టమవుతోంది. దీంతో ట్రోల్స్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్టయ్యింది.
ఇవీ చదవండి: Malavika Mohanan : మాళవిక మోహనన్.. రాజా సాబ్ ఈవెంట్ పిక్స్ వైరల్..
Malavika Mohanan : చీరకట్టులో మెరిసిన మాళవిక మోహనన్..
Esha Rebba : ఈషా రెబ్బా–తరుణ్ భాస్కర్ డేటింగ్ రూమర్స్‌పై హీరోయిన్ స్పందన
