Virajitha: సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటీమణుల్లో విరాజిత ఒకరు. హీరోయిన్ కాకపోయినా తన సహజ నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
1. విశాఖపట్నం అమ్మాయి విరాజిత
విరాజిత విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. మంచి విద్యాభ్యాసం పూర్తి చేసి మధ్యప్రదేశ్‌లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా తన కెరీర్ ప్రారంభించింది.
2. జాబ్ వదిలి నటనలోకి అడుగు
చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న విరాజిత, స్కూల్ రోజులలో స్కిట్లు, డ్రామాల్లో పాల్గొనేది. ఆ ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్లు ఇవ్వడం ప్రారంభించింది.
3. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తొలి అవకాశం
మొదట ఓ సినిమాలో హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం దక్కింది. ఆ సిరీస్ విజయవంతం కావడంతో మరిన్ని అవకాశాలు ఆమెకు లభించాయి.
4. ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్‌ల విజయాలు
ప్రసాద్ బెహ్రాతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించాయి. ముఖ్యంగా ‘పెళ్లి వారమండి’ వెబ్ సిరీస్‌తో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది.
5. గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యం
విరాజితకు హీరోయిన్‌గా గుర్తింపు పొందడం కంటే మంచి నటిగా నిలవడమే లక్ష్యం. అందుకే గ్లామర్ రోల్స్, స్కిన్ షోలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంది.
ఇవీ చదవండి: Actress Hema : ఇంక అలాంటి మూవీస్ చేయను.. ఆ హీరోలందరితో మంచి రిలేషన్ ఉంది : హేమ
Actress Sahasra Reddy: హైదరాబాదీ అందం.. అభినయం.. సో బ్యూటిఫుల్! సహస్రారెడ్డి ఫొటో గ్యాలరీ..
Netflix 2026: ఓటీటీ లవర్స్.. ఇది మీకోసమే.. కొత్తగా ఏ మూవీస్, web series వస్తున్నాయంటే..
Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌కు క్షమాపణలు చెప్పిన స్నేహ ఉల్లాల్.. ఆసక్తికర విషయాలు వెల్లడి
