Actress Hema : టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి Hema. అద్భుతమైన నటనతో పాటు సహజమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ముఖ్యంగా Brahmanandamతో కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన హేమ, సహాయక పాత్ర అంటే వెంటనే గుర్తుకు వచ్చే నటీమణుల్లో ముందువరసలో ఉంటారు. కోవై సరళ తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించిన నటిగా హేమకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె నటించిన ఎన్నో సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.
ఇటీవల హేమ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆమెకు పూర్తిస్థాయి క్లీన్‌చిట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ, గత ఏడాది కాలంగా తాను ఎదుర్కొన్న కష్టాల సమయంలో ప్రజల నుంచి, అభిమానుల నుంచి అపారమైన మద్దతు లభించిందని చెప్పారు. తన కోసం దేవాలయాల్లో పూజలు చేసిన అభిమానుల ఆశీర్వాదాల వల్లే ఈ సమస్య నుంచి బయటపడగలిగానని భావిస్తున్నానన్నారు. ఈ అనుభవమే మళ్లీ సినిమాల వైపు రావాలనే ఉత్సాహాన్ని ఇచ్చిందని వెల్లడించారు.
ఇకపై తల్లి, అక్క వంటి పరిమిత పాత్రలకే కాకుండా, డైలాగ్స్ ఉన్న బలమైన పాత్రలు చేయాలనుకుంటున్నానని హేమ స్పష్టం చేశారు. దర్శకుడు Trivikram Srinivasను తాను సినీ పరిశ్రమలో తన గాడ్‌ఫాదర్‌లా భావిస్తానని, ఏ సమస్య వచ్చినా ముందుగా ఆయనతోనే మాట్లాడతానని తెలిపారు. అలాగే Nagarjuna Akkineniతో వ్యాపార విషయాలపై చర్చిస్తుంటానని చెప్పారు.
Nandamuri Balakrishna తన కుమార్తె ఈషా పుట్టినప్పుడు ఇంటికి వచ్చి ఆశీర్వదించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, అది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని చెప్పారు. అలాగే Chiranjeevi ఒక సినిమా షూటింగ్ సమయంలో తన ఇంటికి వచ్చి, తాను స్వయంగా చేసిన కాఫీ తాగి వెళ్లిన రోజు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు.
Nagarjuna Akkineni స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తన ఇంటికి లంచ్‌కు వచ్చారని, ఆయనకు ఇష్టమైన చేపల పులుసు, ఆవకాయ పచ్చడి వంటివి చేసి వడ్డించిన జ్ఞాపకాలను హేమ పంచుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను చూడాలనిపిస్తే ఆయన మేనేజర్‌కు కబురు పెడితే తన ఇంటికే వచ్చారని చెప్పిన హేమ, K. Raghavendra Rao తనకు ఫోన్ చేసి ధైర్యాన్ని మెచ్చుకుంటూ, కేసు క్వాష్ అయినందుకు అభినందనలు తెలిపారని వెల్లడించారు. అలాగే Prabhas కజిన్ తనకు సన్నిహితుడని, అవసరమైతే ప్రభాస్‌ను కలవడం తనకు పెద్ద విషయం కాదని ధీమా వ్యక్తం చేశారు.
తన తండ్రి, తల్లి, అక్క, బావ, మిత్రులు, శత్రువులు అందరూ సినీ పరిశ్రమలోనే ఉన్నారని, ఇదే తన అడ్డా అని హేమ అన్నారు. Nandamuri Balakrishna, Nagarjuna Akkineniలను ‘బాబు’ అని, Mahesh Babuను ‘మహీ’ అని, Prabhasను ‘డార్లింగ్’ అని పిలుస్తానని తెలిపారు.
నూతన సంవత్సర పండుగలు ముగిసిన వెంటనే దర్శకులు, నిర్మాతలను కలిసి మళ్లీ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నానని హేమ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Tollywood : స్టార్ హీరోతో లిప్‌లాక్ సీన్.. కావాలనే అలా చేశాను.. టాలీవుడ్ నటి ఓపెన్ కామెంట్స్
Tollywood : 30 ఏళ్ల వయసు తేడా ఉంటే తప్పేంటి! హీరోలతో రొమాన్స్‌పై కౌంటర్ ఇచ్చిన యువ నటి
