Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటోంది. అయితే ఈ సినిమా విజయంతో పాటు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో హీరో ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘ధురంధర్ 2’
ఆదిత్య ధర దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదలైంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.
2. విజయంతో పాటు విమర్శలు కూడా
పుష్ప 2, యానిమల్, కేజీఎఫ్ 2 వంటి భారీ విజయాలు సాధించిన సినిమాల మాదిరిగానే ‘ధురంధర్ 2’పైనా కొందరు విమర్శలు చేస్తున్నారు.
3. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’లో ఇమ్రాన్ వ్యాఖ్యలు
ఆమీర్ ఖాన్ మేనల్లుడు, హీరో ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాలో నిర్వహించిన ‘Ask Me Anything’ సెషన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
4. మాచో పాత్రలపై ఆసక్తి లేదన్న ఇమ్రాన్
జుట్టు పొడవుగా పెంచుకుని, కోపంగా కనిపిస్తూ, రక్తంతో నిండిన మాచో పాత్రలపై తనకు ఆసక్తి లేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
5. విషపూరిత పురుషాధిక్యతపై ఆందోళన
ప్రస్తుతం సినిమాల్లో ‘ఆల్ఫా మేల్’ పాత్రలు పెరుగుతున్నాయని, అవి స్త్రీద్వేషం మరియు విషపూరిత పురుషాధిక్యతను ప్రోత్సహిస్తున్నాయనే అభిప్రాయాన్ని ఇమ్రాన్ ఖాన్ వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇవీ చదవండి: Dhurandhar 2: పుష్పరాజ్‌దే డామినేషన్.. బీట్ చేయలేకపోయిన దురంధర్ 2
Dhurandhar 2: దురంధర్-2 క్రేజ్ మామూలు కాదు.. కోహ్లీ, సెహ్వాగ్‌తో వైరల్ అవుతున్న వీడియో
Dhurandhar 2: ధురంధర్ 2 రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్
Dhurandhar 2: దురంధర్-2 హంగామా.. బాక్సాఫీస్ వద్ద సంచలనం.. తొలి చిత్రంగా రికార్డు
